రూబిక్ క్యూబ్‌ను సాల్వ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. దాని కోసం చాలా కష్టపడాలి. దాని ఫార్ములా తెలుసుకోవాలి. అప్పుడే అన్ని సైడ్స్ సాల్వ్ చేయగలం. కానీ.. ఓ బాలుడు మాత్రం రూబిక్ క్యూబ్‌ను ఇట్టే సాల్వ్ చేసేశాడు. కేవలం 14 సెకండ్లలో దాన్ని సాల్వ్ చేసి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కేశాడు. అది కూడా సైకిల్ తొక్కుతూ రూబిక్ క్యూబ్‌ను సాల్వ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ప్రస్తుతం ఆ బాలుడి రికార్డుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చెన్నైకి చెందిన జయదర్శన్ వెంకటేశన్ అనే బాలుడు కేవలం 14.32 సెకండ్లలో రూబిక్ క్యూబ్‌ను సైకిల్ తొక్కుతూ సాల్వ్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను క్రియేట్ చేశాడు. దాదాపు రెండేళ్లుగా జయదర్శన్.. రూబిక్ క్యూబ్‌ను వేగంగా సాల్వ్ చేసే టెక్నిక్‌ను నేర్చుకుంటున్నాడట. ఈ వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డు ఇన్‌స్టా పేజీలో షేర్ చేశారు.
రెండేళ్ల క్రితం చెన్నైకే చెందిన ఓ వ్యక్తి రూబిక్ క్యూబ్‌ను అండర్ వాటర్‌లో సాల్వ్ చేసి రికార్డు క్రియేట్ చేశాడు. అండర్ వాటర్‌లో 2 నిమిషాల 17 సెకండ్లు ఉండి.. 6 రూబిక్ క్యూబ్‌లను సాల్వ్ చేశాడు.