లక్నో : యూపీలోని హపూర్లో ఆడుకుంటూ 60 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయిన ఆరేండ్ల బాలుడిని క్షేమంగా బయటకు తీసుకువచ్చిన ఘటన వెలుగుచూసింది. బావి నుంచి సాయం కోరుతూ బాలుడి అరుపులు విన్న గ్రామస్తులు అధికారులకు సమాచారం అందించారు. బాలుడు బోరుబావిలో పడిపోవడంతో ఆ ప్రాంతంలో భయాందోళన నెలకొంది.
హపూర్ మున్సిపాలిటీకి చెందిన బోరుబావిలో బాలుడు పడిపోవడంతో మున్సిపల్ సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా రంగంలోకి దిగి చిన్నారిని కాపాడేందుకు శ్రమించింది. బోరుబావి నుంచి బాలుడిని సహాయ సిబ్బంది క్షేమంగా బయటకుతీసుకువచ్చారు. బాలుడు స్వల్పగాయాలతో తల్లితండ్రుల చెంతకు చేరడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.