చందా కొచ్చార్‌ను రిలీజ్ చేయండి: బాంబే హైకోర్టు ఆదేశం
Chanda Kochharవీడియోకాన్ ఫ్రాడ్ కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చార్‌కు ఊరట లభించింది. చందా కొచ్చార్‌తో పాటు ఆమె భర్తను రిలీజ్ చేయాలని బాంబే హైకోర్టు ఇవాళ తన ఆదేశాల్లో పేర్కొన్నది. వాళ్ల అరెస్టు చట్టానికి లోబడి జరగలేదని కోర్టు అభిప్రాయపడింది. వీడియోకాన్ సంస్థకు అక్రమరీతిలో రుణాలు మంజూరీ చేసిన కేసులో చందా కొచ్చార్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ముంబై: వీడియోకాన్ ఫ్రాడ్ కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చార్‌కు ఊరట లభించింది. చందా కొచ్చార్‌తో పాటు ఆమె భర్తను రిలీజ్ చేయాలని బాంబే హైకోర్టు ఇవాళ తన ఆదేశాల్లో పేర్కొన్నది. వాళ్ల అరెస్టు చట్టానికి లోబడి జరగలేదని కోర్టు అభిప్రాయపడింది. వీడియోకాన్ సంస్థకు అక్రమరీతిలో రుణాలు మంజూరీ చేసిన కేసులో చందా కొచ్చార్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
చందా కొచ్చారోతో పాటు ఆమె భర్త దీపక్ కొచ్చార్‌ను డిసెంబర్ 24వ తేదీన సీబీఐ అరెస్టు చేసింది. వీడియోకాన్ గ్రూపు సంస్థకు 2012లో సుమారు 3250 కోట్ల మొత్తాన్ని అక్రమరీతిలో లోన్ ఇప్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. జస్టిస్ రేవతి మోహితే దేరే, జస్టిస్ పీకే చావన్‌లతో కూడిన ధర్మాసనం తాజా తీర్పును ఇచ్చింది. క్రిమినల్ కోడ్‌లోని 41ఏ సెక్షన్‌ను ఉల్లంఘించి ఆ ఇద్దరి అరెస్టు చేసినట్లు కోర్టు తెలిపింది.
లక్ష రూపాయాల బెయిల్ బాండ్‌పై ఆ ఇద్దర్ని విడిచిపెట్టనున్నారు. కుటుంబ లబ్ధి కోసం కొచ్చార్ ఫ్యామిలీ చీటింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీడియోకాన్ రుణాన్ని ఎన్పీఏగా భావించి, దాన్ని బ్యాంక్ ఫ్రాడ్‌గా ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

