Bomb Threats | విమానాలకు బాంబు బెదిరింపులు.. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం..!
Bomb Threats | దేశంలోని పలు విమానాలు, విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు భారీగా పెరిగాయి. ఈ బెదిరింపులు కేంద్ర ప్రభుత్వానికి సవాల్‌గా మారాయి. దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల నుంచి వచ్చే విమానాల్లో స్కై మార్షల్స్‌ని రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వి
Bomb Threats | దేశంలోని పలు విమానాలు, విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు భారీగా పెరిగాయి. ఈ బెదిరింపులు కేంద్ర ప్రభుత్వానికి సవాల్‌గా మారాయి. దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల నుంచి వచ్చే విమానాల్లో స్కై మార్షల్స్‌ని రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. విమానాలు, విమానాశ్రయాలకు పెరుగుతున్న ముప్పును అంచనా వేసి.. నిఘా సంస్థల నుంచి వచ్చిన ఇన్పుట్స్ అందిన తర్వాత స్కై మార్షల్ సంఖ్యను రెట్టింపు చేయాలని నిర్ణయించినట్లు హోంమంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి తెలిపారు. గడిచిన మూడురోజుల్లో 12 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలో భద్రతా ఏజెన్సీలు తనిఖీలు నిర్వహించి.. ఫేక్ బెదిరింపులుగా తేల్చారు. నిరంతరం పెరుగుతున్న బెదిరింపుల మధ్య బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS), పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (MoCA)తో చర్చించింది.
ఈ చర్చల్లో బెదిరింపులను గుర్తించడానికి, నో ఫ్లై జాబితాలో చేర్చేందుకు ఏజెన్సీలు కలిసి పని చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది. దాంతో పాటు ఎఫ్ఐఏ నివేదిక ఆధారంగా సెన్సిటివ్ కేటగిరిలో చేర్చిన కొత్త అంతర్జాతీయ మార్గాల్లో కొత్త బ్యాచ్ ఎయిర్ మార్షల్స్‌ని మోహరించనున్నట్లు అధికారి చెప్పారు. భద్రతా సంస్థలతో పలు సమావేశాల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, పార్లమెంటరీ కమిటీ ముందు ఈ అంశాన్ని లేవనెత్తారు. విమానాశ్రయాలు, విమానాలకు వస్తున్న బెదిరింపుల అంశం బుధవారం పార్లమెంటరీ కమిటీలో వేడెక్కింది. ఈ విషయమై ఎంపీలు అడిగిన ప్రశ్నలకు పౌర విమానయాన శాఖ కార్యదర్శి వుమ్లున్మాంగ్ వుల్నమ్ స్పందిస్తూ.. నిందితులను గుర్తించే పనిలో ఉన్నట్లు తెలిపారు. ఏజెన్సీలు చర్యలు తీసుకుంటున్నాయని.. అధికారులు కొంత సమాచారాన్ని సేకరించాయన్నారు. ఫేక్ మెసేజ్‌లపై కేసులు నమోదు చేస్తున్నారన్నారు. ఈ విషయంపై విచారణ కొనసాగుతున్నందున.. సమాచారం సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకొని వివరాలను చెప్పేందుకు ఆ అధికారి నిరాకరించారు.
స్కై మార్షల్స్ అంటే..?
ఎయిర్ మార్షల్స్ తీవ్రవాద, హైజాకింగ్ నిరోధక చర్యల్లో పాల్గొంటారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌లోని విభాగం. స్కై మార్షల్ ప్రధానంగా అంతర్జాతీయ మార్గాలు, కొన్ని సున్నితమైన మార్గాల్లో మోహరిస్తుంటారు. స్కై మార్షల్స్ సాధారణ దుస్తుల్లో ప్రయాణికులతో కలిసి ప్రయాణిస్తుంటారు. కాందహార్‌లో ఎయిర్ ఇండియాకు చెందిన ఐసీ814 విమానాన్ని హైజాక్ చేసిన అనంతరం.. భవిష్యత్‌లో మరోసారి హైజాక్ జరుగకుండా ఉండేందుకు 1999లో భారత్ తొలిసారిగా స్కై మార్షల్స్‌ని ప్రవేశపెట్టింది. స్కై మార్షల్‌ని ఫ్లై సెక్యూరిటీ ఆఫీసర్ అని కూడా పిలుస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

