Bomb threat | ఛత్రపతి శివాజీ మ్యూజియం సహా ముంబైలోని 8 సంస్థలకు బాంబు బెదిరింపులు
Bomb threat | ఆర్థిక రాజధాని ముంబై (Mumbai)లోని పలు సంస్థలకు బాంబు బెదిరింపులు (Bomb threat) కలకలం రేపాయి. 8 సంస్థలను లక్ష్యంగా చేసుకొని కొందరు ఈ బెదిరింపులకు పాల్పడ్డారు.
Bomb threat | ఆర్థిక రాజధాని ముంబై (Mumbai)లోని పలు సంస్థలకు బాంబు బెదిరింపులు (Bomb threat) కలకలం రేపాయి. 8 సంస్థలను లక్ష్యంగా చేసుకొని కొందరు ఈ బెదిరింపులకు పాల్పడ్డారు. ముంబై కొలాబా ప్రాంతంలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ మ్యూజియం (Chhatrapati Shivaji Maharaj Museum ), వర్లీలోని నెహ్రూ సైన్స్ సెంటర్ (Nehru Science Centre), బైకుల్లా జూ (Byculla Zoo) సహా పలు సంస్థలను బాంబులతో పేల్చేస్తామంటూ బెదిరించారు. శుక్రవారం సాయంత్రం ఆయా సంస్థలకు బెదిరింపు మెయిల్స్ ( threat mail) వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ముందుగా మ్యూజియంకు బెదిరింపు మెయిల్ వచ్చినట్లు చెప్పారు.
బెదిరింపు మెయిల్స్‌తో అప్రమత్తమైన అధికారులు నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అదేవిధంగా బెదిరింపులు వచ్చిన సంస్థల వద్దకు బాంబ్ స్వ్కాడ్ చేరుకొని తనిఖీలు చేపట్టింది. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ కనిపించలేదు. ఆయా సంస్థలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈమెయిల్స్ ఆధారంగా నిందితుల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు కొలాబా పోలీస్ స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తులపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
కాగా, గత కొన్ని రోజులుగా దేశంలోని పలువురు ప్రముఖులు, పారిశ్రామివేత్తలు, విమానాశ్రయాలు, బ్యాంకులు, ప్రముఖ ఆలయాలకు బాంబు బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్లో ముంబైలోని పలు బ్యాంకులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులకు ఖిలాఫత్ ఇండియా మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆ తర్వాత ఢిల్లీ, జైపూర్, లక్నో, చండీగఢ్, ముంబై, చెన్నై, అమ్మదాబాద్ ఎయిర్‌పోర్టులపై బాంబు దాడి చేయబోతున్నట్లు కొందరు ఆగంతకులు ఈమెయిల్ ద్వారా బెదిరించారు. గురువారం కూడా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath)కు బాంబు బెదిరింపులు (Bomb Threats) వచ్చాయి. అయోధ్యలో నిర్మించిన రామ మందిరం (Ayodhya Ram temple)తో సహా పేల్చేస్తామంటూ సీఎంను బెదిరించారు. ఆ తర్వాత నిన్న అంటే శుక్రవారం కోల్‌కతా (Kolkata )లోని ఇండియన్ మ్యూజియం (Indian Museum)కు బాంబు బెదిరింపులు (Bomb threats) వచ్చాయి.
Also Read..
Coronavirus | వరుసగా రెండో రోజూ 700కు పైనే కొత్త కేసులు.. నిన్న ఒక్కరోజే 921 మంది డిశ్చార్జ్
Hijacked Ship | హైజాక్ అయిన నౌకలోని సిబ్బందిని ఇలా రక్షించారు.. వీడియో షేర్ చేసిన నేవీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

