Boat Capsizes | గంగా నదిలో పడవ బోల్తా.. ముగ్గురు మృతి, నలుగురు గల్లంతు
Boat Capsizes | గంగా నదిలో పడవ బోల్తా పడింది. ఈ సంఘటనలో ముగ్గురు మరణించారు. మరో నలుగురు గల్లంతయ్యారు. రెస్క్యూ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గల్లంతైన వారి కోసం నదిలో గాలింపు చర్యలు చేపట్టారు.
పాట్నా: గంగా నదిలో పడవ బోల్తా పడింది. (Boat Capsizes) ఈ సంఘటనలో ముగ్గురు మరణించారు. మరో నలుగురు గల్లంతయ్యారు. రెస్క్యూ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గల్లంతైన వారి కోసం నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. బీహార్‌లోని కతిహార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం 17 మందితో కూడిన పడవ అమ్దాబాద్ ప్రాంతంలోని గోలాఘాట్ సమీపంలో గంగా నదిలో బోల్తా పడి మునిగింది. అప్రమత్తమైన కొందరు ఈదుకుంటూ నది ఒడ్డుకు చేరుకున్నారు.
కాగా, పడవ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు, అధికారులు అక్కడకు చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. నదిలో పడిన పది మందిని రక్షించారు. ఈ సంఘటనలో ముగ్గురు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఇద్దరు మృతులను 60 ఏళ్ల పవన్ కుమార్, 70 ఏళ్ల సుధీర్ మండల్‌గా గుర్తించినట్లు చెప్పారు. మరణించిన మరో వ్యక్తిని ఇంకా గుర్తించలేదన్నారు.
మరోవైపు పడవ బోల్తాపడిన ఘటనలో నలుగురు వ్యక్తులు గంగా నదిలో గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. వారి కోసం సహాయక, గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. పడవలో ఎక్కువ మంది ప్రయాణించడం వల్లనే బోల్తా పడి మునిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. పడవ ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ మనేష్ కుమార్ మీనా వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
Kanpur Accident: థార్ వాహనంతో స్కూటర్‌ను ఢీకొట్టిన మహిళ.. కాన్పూర్ ఘటనలో ఒకరు మృతి
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

