BMW, Audi Cars Catch Fire | మంటల్లో కాలిన ఖరీదైన కార్లు.. ఒక కారులో షార్ట్ సర్క్యూట్‌గా అనుమానం
BMW, Audi Cars Catch Fire | రోడ్డు పక్కన రిసార్ట్ వద్ద పార్క్ చేసిన ఖరీదైన కార్లు మంటల్లో కాలిపోయాయి. బీఎండబ్ల్యూ, ఆడి వంటి విలువైన ఐదు కార్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. (BMW, Audi Cars Catch Fire) ఒక కారులో షార్ట్ సర్క్యూట్ వల్ల రాజుకున్న మంటలు పక్కనే పార్క్ చేసి ఉన్న పలు కార్లకు వ్యాపించి ఉంటాయని అనుమానిస్తున్నారు.
చండీగఢ్: రోడ్డు పక్కన రిసార్ట్ వద్ద పార్క్ చేసిన ఖరీదైన కార్లు మంటల్లో కాలిపోయాయి. బీఎండబ్ల్యూ, ఆడి వంటి విలువైన ఐదు కార్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. (BMW, Audi Cars Catch Fire) ఒక కారులో షార్ట్ సర్క్యూట్ వల్ల రాజుకున్న మంటలు పక్కనే పార్క్ చేసి ఉన్న పలు కార్లకు వ్యాపించి ఉంటాయని అనుమానిస్తున్నారు. పంజాబ్‌లో ఈ సంఘటన జరిగింది. జలంధర్-అమృత్సర్ హైవేపై ఉన్న ఫెయిర్ ఫామ్ రిసార్ట్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున భారీగా మంటలు చెలరేగాయి. అక్కడ పార్క్ చేసిన బీఎండబ్ల్యూ, ఆడి వంటి ఖరీదైన కార్లకు మంటలు వ్యాపించాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కార్లకు వ్యాపించిన మంటలను ఆర్పివేశారు. ఒక కారులో షార్ట్ సర్క్యూట్ కారణంగా రాజుకున్న మంటలు పక్కనే పార్క్ చేసిన మిగతా వాహనాలకు వ్యాపించినట్లు పోలీసులు, ఫైర్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనలో బీఎమ్‌డబ్ల్యూ, ఆడి సహా అత్యంత ఖరీదైన ఐదు కార్లు మంటల్లో కాలినట్లు తెలిపారు. జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఈ అగ్ని ప్రమాదం కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఖరీదైన కార్లు మంటల్లో కాలిపోవడాన్ని కొందరు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్స్‌లో రికార్డ్ చేశారు. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
On Camera, BMW, Audi Cars Catch Fire After Short-Circuit In Punjab https://t.co/tSxKkfXMe4 pic.twitter.com/pDR7LiIoFg
— NDTV (@ndtv) January 12, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- audi
- BMW
- Cars
- Catch Fire
RELATED ARTICLES
తాజా వార్తలు
America | అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘స్పిరిట్’ సెట్స్ నుంచి సందీప్ రెడ్డి వంగా సర్ప్రైజ్ పోస్ట్
Haiku Movie | ‘హైకూ’ మూవీ రివ్యూ.. యూత్ ఫుల్ లవ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకునే జెన్ జీ ప్రేమకథ!
వేయిస్తంభాల గుడి సుందరీకరణకు ప్రజలు సహకరించాలి : మున్సిపల్ కమిషనర్ వెంకన్న
Speaker Sets Deadline | టీవీకేలో చేరిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు.. గడువు విధించిన స్పీకర్
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

