PM Modi | ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది.. పహల్గాం ఉగ్రదాడిపై ప్రధాని మోదీ
PM Modi | ఈ నెల 22న పహల్గామ్ (Pahalgam) లో ఉగ్రవాదులు (Terrorists) జరిపిన నరమేథం యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు. ఆ హేయమైన దాడితో ఇప్పుడు ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోందని చెప్పారు.
PM Modi : ఈ నెల 22న పహల్గామ్ (Pahalgam) లో ఉగ్రవాదులు (Terrorists) జరిపిన నరమేథం యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు. ఆ హేయమైన దాడితో ఇప్పుడు ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోందని చెప్పారు. ఆ దాడికి కఠినాతికఠినంగా బదులు తీర్చుకుని తీరుతామని ప్రధాని స్పష్టం చేశారు. మన్ కీ బాత్ (Mann ki Baath) కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఆలిండియా రేడియోలో మాట్లాడిన ప్రధాని.. పహల్గాం ఉగ్రదాడిపై తీవ్రంగా స్పందించారు.
పహల్గాం ఉగ్రదాడి తనను ఎంతగానో కలచి వేసిందని, ప్రతి భారతీయుడు ఈ దారుణాన్ని మర్చిపోలేకపోతున్నాడని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. జమ్ముకశ్మీర్ పురోగతిని చూసి ఓర్వలేక ఉగ్రవాదులు ఇలాంటి పిరికి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పహల్గాం పర్యాటకంగా అభివృద్ధి చెందడాన్ని సహించలేక అమాయకులపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్రదాడి బాధితులకు న్యాయం జరిగేలా తాము చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
జమ్ముకశ్మీర్‌లో గత కొన్నాళ్లుగా శాంతి, సామరస్యం నెలకొన్నాయని, ఆ పరిస్థితిని చెడగొట్టడానికే ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారని ప్రధాని ఆరోపించారు. జమ్ముకశ్మీర్ ప్రశాంతంగా ఉండటం ఉగ్రవాదులకు, వాళ్లను పెంచిపోషిస్తున్న వాళ్లకు ఇష్టం లేదని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

