ఢిల్లీలో ఉచిత విద్యుత్‌ను అడ్డుకునేందుకు బీజేపీ యత్నం..
CM Kejriwal | ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నాయకులపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిప్పులు చెరిగారు. పహార్గంజ్లో ఇవాళ ఎన్నికల ప్రచారం నిర్వహించారు కేజ్రీవాల్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో ఉచిత విద్యుత్
న్యూఢిల్లీ : ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నాయకులపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిప్పులు చెరిగారు. పహార్గంజ్లో ఇవాళ ఎన్నికల ప్రచారం నిర్వహించారు కేజ్రీవాల్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో ఉచిత విద్యుత్ సరఫరాను అడ్డుకునేందుకు బీజేపీ యత్నిస్తుందని మండిపడ్డారు. ఉచిత విద్యుత్ ఇస్తున్న ఆప్ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు విమర్శలు చేయడం సరైంది కాదన్నారు. ఉచిత విద్యుత్ సరఫరా నిలిపివేయాలని బీజేపీ నాయకులు కోరుతున్నారు. ఎందుకు నిలిపివేయాలి? అని ప్రశ్నించారు. కేజ్రీవాల్ బతికున్నంత వరకు ఢిల్లీలో ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగుతుందని స్పష్టం చేశారు. 2019లో ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రకటించారు కేజ్రీవాల్.
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్‌కు ఒక్కసారి అధికారం ఇవ్వండి. మంచినీరు, విద్యుత్‌ను ఉచితంగా సరఫరా చేసినట్టే.. చెత్త సమస్యను కూడా పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. చెత్త విషయంలో బీజేపీపై తమ పోరాటం కొనసాగుతుందని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో 250 స్థానాలకు గానూ ఆప్ 230 స్థానాల్లో గెలవాలన్నారు. అప్పుడే ఆప్ అధికారంలోకి వచ్చి.. అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఒక వేళ మళ్లీ బీజేపీ గెలిస్తే అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతాయన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
రైస్ మిల్లు యజమాని మాయాజాలం.. రూ.7.85 కోట్ల ధాన్యం మాయం!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

