కరోనా కేసుల పెరుగుదల : కేరళ మోడల్‌పై కాషాయపార్టీ ఫైర్

న్యూఢిల్లీ : రెండు నెలల గరిష్ట స్ధాయిలో మంగళవారం కేరళలో అత్యధిక కేసులు వెలుగుచూడటం, పాజిటివిటీ రేటు 12.35 శాతానికి ఎగబాకడంతో కేరళ మోడల్‌పై కాషాయ పార్టీ విమర్శలు గుప్పించింది. దేశంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో 50 శాతం కేరళలోనే వెలుగుచూస్తున్నాయని బీజేపీ నేత సంబిట్ పాత్ర పేర్కొన్నారు. కరోనా నియంత్రణలకు బక్రీద్ సందర్భంగా సడలింపులు ఇవ్వడంతోనే మహమ్మారి వ్యాప్తి చెందిందని ఆరోపించారు.
బక్రీద్ సడలింపులతో ఇన్ఫెక్షన్లు పెరిగిపోతే కన్వర్ యాత్ర, కుంభమేళాలను సాకుగా చూపుతున్నారని అంటూ ఇదేనా కేరళ మోడల్ అని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ నేత అమిత్ మాలవీయ సైతం పినరయి విజయన్ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. బక్రీద్ సడలింపులతో మహమ్మారి వ్యాప్తి చెందిందని, దీనిపై సెక్యులరిస్టులు మౌనం దాల్చారని మండిపడ్డారు. కేరళలో తాజాగా కరోనా బారినపడి 156 మంది మరణించడంతో రాష్ట్రంలో కొవిడ్-19 మరణాల సంఖ్య 16,326కు పెరిగింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP
- Covid-19
- Kerala
- Sambit Patra
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

