BJP Spent Over Rs 1,737 Crore | లోక్‌సభ ఎన్నికల్లో.. రూ.1,737 కోట్లకు పైగా ఖర్చు చేసిన బీజేపీ
BJP Spent Over Rs 1,737 Crore | గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రూ.1,737.68 కోట్లను బీజేపీ ఖర్చు చేసింది. పార్టీ ప్రచారానికి రూ.884.45 కోట్లు వ్యయం చేయగా, అభ్యర్థుల ఖర్చుల కోసం రూ.853.23 కోట్లు కేటాయించింది.
న్యూఢిల్లీ: గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రూ.1,737.68 కోట్లను బీజేపీ ఖర్చు చేసింది. (BJP Spent Over Rs 1,737 Crore) పార్టీ ప్రచారానికి రూ.884.45 కోట్లు వ్యయం చేయగా, అభ్యర్థుల ఖర్చుల కోసం రూ.853.23 కోట్లు కేటాయించింది. 2024 లోక్‌సభ ఎన్నికల వ్యయం నివేదికను ఎన్నికల సంఘం(ఈసీ)కు బీజేపీ సమర్పించింది. పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలు, బల్క్ ఎస్ఎంఎస్ ప్రచారాలు, కేబుల్, వెబ్‌సైట్స్, టీవీ ఛానెళ్లలో ప్రమోషనల్ కంటెంట్‌తో సహా మీడియా ప్రకటనల కోసం మొత్తంగా రూ.611.50 కోట్లు ఖర్చు చేసినట్లు ఆ రిపోర్ట్‌లో పేర్కొంది.
కాగా, సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగ్‌లు, జెండాలు వంటి ప్రచార సామగ్రి కోసం రూ. 55.75 కోట్లు బీజేపీ ఖర్చు చేసింది. అలాగే బహిరంగ సభలు, ఊరేగింపులు, ప్రచార సభలు, వేదికల ఏర్పాట్లు, ఆడియో సెటప్‌లు, బారికేడ్లు, వాహనాల కోసం అదనంగా రూ.19.84 కోట్లు వినియోగించింది.
మరోవైపు ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ప్రయాణ ఖర్చులను కూడా ఆ నివేదికలో బీజేపీ పేర్కొంది. స్టార్ క్యాంపెయినర్ల ప్రయాణ ఖర్చు రూ.168.92 కోట్లు, ఇతర పార్టీ నాయకుల ప్రయాణానికి రూ. 2.53 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించింది.
కాగా, సార్వత్రిక ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన అరుణాచల్ ప్రదేశ్‌లో రూ. 5,552.57 కోట్లు, సిక్కింలో రూ. 5,552.41 కోట్లు, ఒడిశాలో రూ.5,555.65 కోట్లు ఖర్చు చేసినట్లు బీజేపీ పేర్కొంది. దీంతో కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావడంతోపాటు ఆయా రాష్ట్రాల్లో గెలుపు కోసం బీజేపీ ప్రధానంగా ప్రచారంపై ఆధారపడినట్లు ఈ ఖర్చుల నివేదిక ద్వారా తెలుస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

