కాంగ్రెస్ జెండాలు ఉన్న ఇండ్ల ఫొటోలు తీయండి
విపక్షాలను, ఆ పార్టీలకు మద్దతిచ్చే వారిని ఇబ్బందులకు గురిచేయడం బీజేపీ నేతలకు నిత్యకృత్యంగా మారింది. కమలదళం పాలనాపగ్గాలు వెలగబెడుతున్న మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘటనే ఇందుకు తాజా ఉదాహరణ. రత్లామ్ నగర మేయర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ నేత ప్రహ్లాద్ పటేల్ ఎన్నికల ప్రచారంలో
వాళ్లకు పథకాలు అందకుండా చూస్తా
మధ్యప్రదేశ్ బీజేపీ నేత బెదిరింపులు
భోపాల్, జూలై 11: విపక్షాలను, ఆ పార్టీలకు మద్దతిచ్చే వారిని ఇబ్బందులకు గురిచేయడం బీజేపీ నేతలకు నిత్యకృత్యంగా మారింది. కమలదళం పాలనాపగ్గాలు వెలగబెడుతున్న మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘటనే ఇందుకు తాజా ఉదాహరణ. రత్లామ్ నగర మేయర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ నేత ప్రహ్లాద్ పటేల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ జెండాలు ఉన్న ఇండ్ల ఫొటోలను తీయాలని కార్యకర్తలకు సూచించారు. ఆ ఇండ్లల్లోని వారికి ప్రభుత్వ పథకాలు, ఇతరత్రా ప్రయోజనాలు దక్కకుండా చూస్తానని హెచ్చరించారు.
ఎన్నికల్లో 5-10 ఇండ్ల ఓట్లు రానంత మాత్రాన తనకేమీ నష్టంలేదని, అయితే అలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పాలని తీవ్ర స్వరంతో అన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇది బీజేపీ అహంకారపూరిత వైఖరికి పరాకాష్ట అని కాంగ్రెస్ మండిపడింది. అయితే, తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని, ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లడానికి ఎవరో ఉద్దేశపూర్వకంగా ఈ పని చేసినట్టు ప్రహ్లాద్ చెప్పుకొచ్చారు. దీనిపై దర్యాప్తునకు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

