Lok Sabha Pro tem Speaker | లోక్‌సభ పొట్రెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్.. ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Lok Sabha Pro tem Speaker | లోక్ సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రపతి ప్రమాణం చేయించారు. ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగనున్న విషయం తెలిసిందే.
Lok Sabha Pro tem Speaker | లోక్ సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రపతి ప్రమాణం చేయించారు. ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగనున్న విషయం తెలిసిందే. కొత్తగా ఎంపికైన ఎంపీలతో ఆయన ప్రమాణస్వీకారం చేయించనున్నారు. అనంతరం లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను ఎన్నుకోనున్నారు. భర్తృహరి మహతాబ్ ఒడిశాలోని కటక్ ఎంపీగా గెలుపొందారు. ఎంపీగా గెలువడం ఇది ఏడోసారి కావడం విశేషం. గతంలో ఆయన నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ పార్టీలో కొనసాగారు. ఎన్నికలకు ముందు బీజేపీ తీర్థం స్వీకరించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయన మాజీ సీఎం హరేకృష్ణ మహతాబ్ తనయుడు. మహతాబ్ నియామకంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 95(1) ప్రకారం ఎంపీ భర్తృహరి మహతాబ్‌ను ప్రోటెం స్పీకర్‌గా నియమించడం సంతోషంగా ఉందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Houthis | మేం మక్కా, మదీనాపై దాడి చేశామనడం అబద్ధం.. సౌదీ చమురుక్షేత్రాలే మా లక్ష్యం : హౌతీస్
EU Mahadharna | EU మహా ధర్నాకు ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ మద్దతు
Baththa | ఓటీటీలోకి విజయ్ సేతుపతి సూపర్ హిట్ మూవీ ‘బత్తా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Cult Fans Meet | విజయ్ దేవరకొండ, నాని బాటలో విశ్వక్ సేన్.. ‘కల్ట్’ కోసం ఫ్యాన్స్ మీట్!
Dancing | ఉత్సవాల సమయంలో గంటల తరబడి నృత్యం చేయొద్దు.. ఎందుకో చెబుతున్న నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

