బీజేపీకి దిమ్మదిరిగే షాక్.. కేరళలో ఖాతా తెరవని కాషాయ పార్టీ

తిరువనంతపురం: కేరళలో బీజేపీకి దిమ్మదిరిగే షాక్ తగిలింది. ఎన్నికలకు ముందు కేరళలో 35 స్థానాలు గెలుస్తామని ప్రగల్బాలు పలికిన ఆ పార్టీ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. ఇంతకు ముందు ఉన్న ఒక్క స్థానం కూడా కోల్పోవడం గమనార్హం. బీజేపీ తన సిట్టింగ్ స్థానం నెమోమ్‌లో కూడా కోల్పోయింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ సహా నటుడు సురేశ్ గోపీ, మెట్రోమ్యాన్ శ్రీధరన్ కూడా ఓటమి పాలయ్యారు.
నెమోమ్ స్థానంలో మొదట బీజేపీ అభ్యర్థి రాజశేఖరన్ ఆధిక్యంలో నిలిచినా.. తర్వాత మూడోస్థానానికి పరిమితమయ్యారు. ఈ స్థానం నుంచి ఎల్డీఎఫ్ అభ్యర్థి శివన్‌కుట్టీ 2025 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అటు మెట్రోమ్యాన్ శ్రీధరన్‌ను పాలక్కడ్ స్థానంలో ఎల్డీఎఫ్ అభ్యర్థి షఫీ పారంబిల్ 2657 ఓట్ల తేడాతో ఓడించారు. అటు త్రిస్సూర్‌లో మొదట్లో ఆధిక్యంలో ఉన్న సురేశ్ గోపీ చివరికి మూడోస్థానంతో సరిపెట్టుకున్నారు. ఈ మూడు స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని భావించినా చివరి రౌండ్లలో ఆ పార్టీ అభ్యర్థులు దారుణంగా ఓడిపోయారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP
- Kerala BJP
- Kerala Elections
- LDF
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

