BJP chief | ఏప్రిల్ చివరినాటికి బీజేపీకి కొత్త అధ్యక్షుడు..!
BJP chief | ఏప్రిల్ చివరి నాటికి భారతీయ జనతాపార్టీకి నూతన జాతీయ అధ్యక్షుడు (BJP national president) ఎన్నిక కానున్నారు.
BJP chief | ఏప్రిల్ చివరి నాటికి భారతీయ జనతాపార్టీకి నూతన జాతీయ అధ్యక్షుడు (BJP national president) ఎన్నిక కానున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ప్రారంభం అవుతుందని సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. రానున్న వారం రోజుల్లో ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్ సహా మిగిలిన రాష్ట్రాల అధ్యక్షుల పేర్లను ప్రకటించనున్నట్లు సదరు వర్గాలు తెలిపినట్లు జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.
పార్టీ రాజ్యాంగం ప్రకారం.. జాతీయ అధ్యక్షుడిని (BJP national president) ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించే ముందు కనీసం సగం రాష్ట్ర యూనిట్లలో సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం జరుగుతున్న సంస్థాగత ఎన్నికలు సజావుగా సాగుతున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. 19 రాష్ట్ర అధ్యక్షుల పేర్లను ప్రకటించిన తర్వాత.. పార్టీ తదుపరి జాతీయ అధ్యక్షుడి కోసం ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే, ఇప్పటికే 13 రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు పూర్తయ్యాయి. ఆయా రాష్ట్ర అధ్యక్షుల పేర్లను కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మిగిలిన రాష్ట్రాల అధ్యక్షుల పేర్లను కూడా ప్రకటించిన అనంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియను ప్రారంభించనున్నారు. అది ఈ నెల చివరినాటికి పూర్తవుతుందని సమాచారం. ఏప్రిల్ చివరికి జేపీ నడ్డా స్థానంలో కొత్త అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
కాగా, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా (JP Nadda) ఉన్న విషయం తెలిసిందే. 2020లో ఆయన బీజేపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ఇక ఇటీవలే కేంద్రంలో ఎన్డీయే కూటమి మూడోసారి అధికారింలోకి వచ్చిన తర్వాత నడ్డాను కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడితోపాటు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగానూ వ్యవహరిస్తున్నారు. ఇక పార్టీ చీఫ్ పదవీకాలం మూడు సంవత్సరాలే. దీంతో ఇటీవలే ఆయన పదవీకాలం ముగిసింది. అయితే, 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నడ్డా పదవీకాలాన్ని పొడిగించారు.
బీజేపీ తొలి అధ్యక్షుడిగా అటల్ బిహారీ వాజ్‌పేయి 1980 నుంచి 1986 వరకు పనిచేశారు. లాల్ కృష్ణ అద్వాణి పలుమార్లు పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1986-1990, 1993-1998, 2004-2005 వరకు ఆయన ఆ పదవీ బాధ్యతలు నిర్వహించారు. మురళీ మనోహర్ జోషి 1991 నుంచి 1993 వరకు, కుషబావు థాకరే 1998 నుంచి 2000 వరకు, బంగారు లక్ష్మణ్ 2000 నుంచి 2001 వరకు, కె జానాకృష్ణమూర్తి 2001 నుంచి 2002 వరకు, ఎం వెంకయ్యనాయుడు 2002 నుంచి 2004 వరకు, రాజ్‌నాథ్ సింగ్ 2005 నుంచి 2009 వరకు, 2013 నుంచి 2014 వరకు, నితిన్ గడ్కరి 2010 నుంచి 2013 వరకు, అమిత్‌షా 2014 నుంరి 2017 వరకు, 2017 నుంచి 2020 వరకు అధ్యక్షులుగా పనిచేశారు. జేపీ నడ్డా 2020 జనవరి 20న పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై అప్పటి నుంచి పదవిలో కొనసాగుతున్నారు.
Also Read..
Yogi Adityanath: రాజకీయాలు నాకు ఫుల్‌టైం జాబ్ కాదు: సీఎం యోగి ఆదిత్యనాథ్
Kathua Combing Operation: కథువాలో కూంబింగ్ ఆపరేషన్.. ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య కాల్పులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

