గురివింద బీజేపీ.. వారసత్వ రాజకీయాలకు అడ్డాగా కమలదళం
గురివింద గింజ నీతిని తలపిస్తున్నది బీజేపీ వైఖరి. కుటుంబ పాలనకు తాము వ్యతిరేకమని గప్పాలు కొడుతున్న ప్రధాని మోదీ.. సొంత పార్టీలో వారసత్వ రాజకీయాలను మాత్రం విస్మరించారు. కేంద్ర మంత్రులు అనురాగ్ఠాకూర్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రదాన్ మొదలుకొని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వరకు లిస్ట్ తీసుకుంటే..
బీజేపీ వారసత్వ రాజకీయాలు
నిజాలను దాచి ప్రత్యర్థి పార్టీలపై మోదీ విమర్శలు
కుటుంబ పాలనకు బీజేపీ వ్యతిరేకమని అబద్ధాలు
గురివింద గింజ నీతిని తలపిస్తున్నది బీజేపీ వైఖరి. కుటుంబ పాలనకు తాము వ్యతిరేకమని గప్పాలు కొడుతున్న ప్రధాని మోదీ.. సొంత పార్టీలో వారసత్వ రాజకీయాలను మాత్రం విస్మరించారు. కేంద్ర మంత్రులు అనురాగ్ఠాకూర్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రదాన్ మొదలుకొని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వరకు లిస్ట్ తీసుకుంటే.. బీజేపీలో ‘వారసత్వ’ నేతల జాబితా చాంతాడంత అవుతుంది. దీన్ని మరిచి ప్రధాని మోదీ ప్రత్యర్థి పార్టీలపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
బీజేపీ వారసత్వ రాజకీయ నేతల్లో కొందరు..
అనురాగ్ ఠాకూర్
కేంద్ర ఐటీ మంత్రి. హిమాచల్ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత ప్రేమ్ కుమార్ ధుమాల్ కుమారుడు.
పీయూష్ గోయల్
కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి. ఈయన బీజేపీ మాజీ జాతీయ కోశాధికారి, మాజీ కేంద్రమంత్రి వేద్ ప్రకాశ్ గోయల్ కుమారుడు.
ధర్మేంద్ర ప్రధాన్
కేంద్ర విద్యాశాఖ మంత్రి. మాజీ కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత దేబేంద్ర ప్రధాన్ కుమారుడు.
జ్యోతిరాదిత్య సింధియా
పౌరవిమానయాన శాఖ మంత్రి. జనసంఘ్ (ఆ తర్వాత బీజేపీలో విలీనమైంది) సీనియర్ నాయకుడు విజయరాజే సింధియా మనుమడు.
కిరణ్ రిజిజు
కేంద్ర న్యాయశాఖ మంత్రి. ఈయన అరుణాచల్ ప్రదేశ్ తొలి ప్రొటెం స్పీకర్ రిన్చిన్ ఖరూ కుమారుడు.
జయంత్ సిన్హా
లోక్‌సభ ఎంపీ. కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా కుమారుడు.
దేవేంద్ర ఫడ్నవీస్
మహారాష్ట్ర మాజీ సీఎం. ఈయన మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ నేత గంగాధర్‌పంత్ ఫడ్నవీస్ కుమారుడు.
పంకజ్ సింగ్
నోయిడా ఎమ్మెల్యే. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ కొడుకు
రీటా బహుగుణ జోషి
లోక్‌సభ ఎంపీ. ఈమె తండ్రి యూపీ మాజీ సీఎం, బీజేపీ నేత హేమావతీ నందన్ బహుగుణ.
దుష్యంత్ సింగ్
లోక్‌సభ ఎంపీ. రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే కుమారుడు.
వరుణ్ గాంధీ
లోక్‌సభ ఎంపీ. బీజేపీ ఎంపీ మేనకా గాంధీ కుమారుడు.
సువేందు అధికారి
బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు. ఈయన లోక్‌సభ ఎంపీ, బీజేపీ నేత శిశిర్ అధికారి కొడుకు.
సన్నీ డియోల్
లోక్‌సభ ఎంపీ. బీజేపీ మాజీ ఎంపీ ధర్మేంద్ర కుమారుడు.
నీరజ్ శేఖర్
రాజ్యసభ ఎంపీ. మాజీ ప్రధాని చంద్రశేఖర్ కుమారుడు.
పూనం మహాజన్
లోక్‌సభ ఎంపీ. ఈమె కేంద్ర మాజీమంత్రి, బీజేపీ సీనియర్ నేత ప్రమోద్ మహాజన్ కుమార్తె.
సంగీత సింగ్ డియో
లోక్‌సభ ఎంపీ. ఒడిశా మాజీ మంత్రి, బీజేపీ నేత కనక్ వర్ధన్ సింగ్ డియో సతీమణి.
పెమా ఖండు
అరుణాచల్ ప్రదేశ్ సీఎం. అరుణాచల్ మాజీ సీఎం దూర్జే ఖండు కుమారుడు.
వివేక్ ఠాకూర్
రాజ్యసభ ఎంపీ. కేంద్ర మాజీ మంత్రి సీపీ ఠాకూర్ కుమారుడు.
హీనా గవిట్
లోక్‌సభ ఎంపీ. బీజేపీ ఎమ్మెల్యే విజయ్‌కుమార్ గవిట్ కుమార్తె.
దియా కుమారి
లోక్‌సభ ఎంపీ. మాజీ ఎంపీ మహారాణి గాయత్రి దేవీ మనుమరాలు.
రాజ్వీర్ సింగ్
లోక్‌సభ ఎంపీ. యూపీ మాజీ సీఎం, రాజస్థాన్ మాజీ గవర్నర్ కళ్యాణ్ సింగ్ కుమారుడు.
అశుతోష్ టాండన్
ఎమ్మెల్యే. బీహార్, మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్ లాల్జీ టాండన్ కుమారుడు.
సురేంద్ర పట్వా
ఎమ్మెల్యే. మధ్యప్రదేశ్ మాజీ సీఎం సుందర్‌లాల్ పట్వా మేనల్లుడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

