ఢిల్లీ ఐఏఎస్ అధికారి సంజీవ్ ఖిర్వార్ బదిలీ ప్రభుత్వానికే నష్టమట : మేనకా గాంధీ
కుక్కతో వాకింగ్ కోసం స్టేడియాన్ని ఖాళీ చేయించిన ఐఏఎస్ అధికారి సంజీవ్ ఖిర్వార్ను కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత మేనకా గాంధీ వెనకేసుకొచ్చారు. ఆయనను లద్దాఖ్‌కు బదిలీ చేయడం ఢిల్లీ ప్రభుత్వాలకే పెద్ద నష్టమని చెప్పుకొచ్చారు. వ్యక్తిగతంగా ఆ ఐఏఎస్ అధికారి తనకు బాగా తెలుసని, ఆయనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనని ఆమె పేర్కొన్నారు. ఆయన పర్యావరణ శాఖకు కార్యదర్శిగా ఉన్న సమయంలో, ఆయన చేపట్టిన చర్యల వల్ల ఢిల్లీ ఎంతో లాభపడిందని, ఆయనపై తీసుకున్న చర్యలు తప్పని మేనకా గాంధీ అన్నారు.
కుక్కతో వాకింగ్ కోసం స్టేడియాన్ని ఖాళీ చేయించిన ఐఏఎస్ అధికారితోపాటు ఆయన భార్యను వేర్వేరు ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. దేశ రాజధానిలో ఈ సంఘటన జరిగింది. ఢిల్లీ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజీవ్ ఖిర్వార్ సాయంత్రం వేళ పెంపుడు కుక్కతో కలిసి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే త్యాగరాజ స్టేడియానికి వాకింగ్‌కు వెళ్లేవారు.
అయితే దీని కోసం స్టేడియం సిబ్బంది క్రీడాకారులను రాత్రి ఏడు గంటలకు ముందుగానే ఖాళీ చేయించేవారు. ఈ ఉదంతంపై కేంద్రం సీరియస్‌గా స్పందించింది. ఐఏఎస్ అధికారి సంజీవ్ ఖిర్వార్ను లడఖ్‌కు, ఆయన భార్య, ఐఏఎస్ అధికారిణి రింకూ దుగ్గను అరుణాచల్ ప్రదేశ్‌కు బదిలీ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

