భోపాల్: మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా ఒక పోలీస్‌కు ప్రథమ చికిత్స చేశారు. భోపాల్‌లో శనివారం ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని ఒక వాహనం నుంచి పోలీస్ సిబ్బంది ఒకరు కిందపడ్డారు. దీంతో ఆయన తలకు గాయమైంది. జ్యోతిరాదిత్య సింధియా వెంటనే స్పందించారు. తన వాహనం నుంచి దిగి గాయపడిన పోలీస్ వద్దకు వచ్చారు. తల భాగంలో కారుతున్న రక్తాన్ని అదుపు చేసేందుకు ఫస్ట్ ఎయిడ్ చేశారు.
కాంగ్రెస్ మాజీ నేత అయిన జోత్యిరాదిత్య సింధియా 2019లో తన అనుకూల ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరారు. దీంతో మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోగా శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎంగా బీజేపీ సర్కార్ ఏర్పడింది.
#WATCH Madhya Pradesh: BJP leader Jyotiraditya Scindia provides first aid to one Police personnel who fell down from one of the vehicles in his convoy and got injured, in Bhopal today. pic.twitter.com/dYljINdVIz
— ANI (@ANI) March 20, 2021