అస్సాంలో కాషాయ రెపరెపలు

77 స్థానాల్లో ఆధిక్యంలో బీజేపీ కూటమి
మజూలీ స్థానంలో సీఎం సర్బానంద ముందంజ
రెండోసారి కాషాయకూటమికి అధికారం
గువాహటి, మే 2: ఈశాన్య రాష్ట్రం అస్సాంలో కాషాయ జెండా మరోసారి రెపరెపలాడింది. రాష్ట్రంలో వరుసగా రెండోసారి విజయం సాధించిన తొలి కాంగ్రెస్సేతర పార్టీగా బీజేపీ నిలిచింది. మొత్తం 126 సీట్లున్న అస్సాం అసెంబ్లీలో 77 స్థానాల్లో బీజేపీ కూటమి ముందంజలో ఉన్నది. ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమి 45 స్థానాలలో ఆధిపత్యం చూపుతున్నది. అస్సాంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కనీసం 64 సీట్లు కావాలి. ఆదివారం సాయంత్రం వెల్లడైన ఫలితాల సరళిని బట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి కావలసిన మెజారిటీ బీజేపీ కూటమికి లభించింది. బీజేపీ 58 స్థానాల్లో, దాని మిత్రపక్షాలు అసోం గణపరిషద్ 11, యునైటెడ్ పీపుల్స్ పార్టీ-లిబరల్ ఎనిమిది స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ 28, దాని మిత్రపక్షాలు ఏఐయూడీఎఫ్ 14, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్) 2 చోట్ల, సీపీఎం ఒక చోట ఆధిక్యంలో ఉన్నాయి.
ఆధిక్యంలో ప్రముఖులు
రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ మజూలీలో, ఆరోగ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ జలుక్బరీలో, ఏజీపీ అధ్యక్షుడు, మంత్రి అతుల్ బోరా బొకాఖాట్తో ముందంజలో ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రంజీత్ దాస్ పత్చర్కుచిలో ఆధిక్యం కనబరుస్తున్నారు. మరోవైపు, అసెంబ్లీ స్పీకర్ హితేంద్ర నాథ్ గోస్వామి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రిపున్ బోరా పరాజయం పాలయ్యారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Assam
- BJP
- election2021
RELATED ARTICLES
తాజా వార్తలు
82% జీవోలు రహస్యం.. కాంగ్రెస్ పాలనలో మితిమీరిన గోప్యత
Jupally Krishna Rao | మంత్రి జూపల్లిని విమర్శించారని.. యువకుడిని చితకబాదిన ఎస్సై
Nereducherla | బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకుల దాడి!
Journalist Shankar | ప్రశ్నించినందుకు జర్నలిస్టు శంకర్ అరెస్ట్.. మెడికవర్ యాజమాన్యం ఫిర్యాదుపై కేసు
Asian Para Games | భారత్‌కు ఒక్క రోజే 26 మెడల్స్.. 2 స్వర్ణాలతో మెరిసిన ఆర్చర్ శీతల్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

