Rahul Gandhi | అదంతా బీజేపీ విద్వేష ఫ్యాక్టరీ పుణ్యమే: రాహుల్ ఫైర్
Rahul Gandhi | కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. బుల్లిబాయ్ యాప్ సృష్టికర్త నీరజ్ బిష్ణోయ్ చేసిన

Rahul Gandhi | కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. బుల్లిబాయ్ యాప్ సృష్టికర్త నీరజ్ బిష్ణోయ్ చేసిన పనిని చూసి దేశం ముక్కున వేలేసుకుందని అన్నారు. ఇంత చిన్న వయస్సులోనే అంత ద్వేషం ఎలా వచ్చిందని అనుకుంటున్నారన్నారు. అదంతా బీజేపీ పనేనని, ద్వేషాన్ని నూరిపోసే ఫ్యాక్టరీని తయారు చేసి, యువకులను ఉపయోగించుకుంటోందని రాహుల్ సంచలన ఆరోపణలు చేశారు. అలాగే టెక్ ఫాగ్ యాప్ కూడా ఈ ద్వేషాన్ని నూరిపోసే ఫ్యాక్టరీలోనే భాగమేనని రాహుల్ ఆరోపించారు.
బుల్లిబాయ్ అనే యాప్‌ను తయారు చేసి ముస్లిం మహిళలను అమ్మకానికి పెడుతున్న నీరజ్ బిష్ణోయ్ అనే యువకుడ్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈయన వయస్సు కేవలం 20 సంవత్సరాలు. ముస్లిం మహిళల ఫొటోలను ఎడిట్ చేసి, మొహాలను మార్ఫింగ్ చేసి ఈ యాప్‌లోనే అప్లోడ్ చేస్తుండేవాడు. ఈ వ్యవహారాన్ని శివసేన ఎంపీ ప్రియాంక ద్వివేదీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఈ యాప్ సృష్టికర్త నీరజ్ బిష్ణోయ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

