Mallikarjun Kharge: బీజేపీ ప్రభుత్వం అదానీ ప్రయోజనాల కోసం పనిచేస్తోంది: ఖర్గే
Mallikarjun Kharge:రాహుల్ గాంధీని మెరుపు వేగంతో అనర్హుడిగా ప్రకటించారు.. 50 లక్షల కోట్ల బడ్జెట్‌ను కేవలం 12 నిమిషాల్లో చర్చ లేకుండా ఆమోదించారు.. కేవలం అదానీ ప్రయోజనాల కోసం బీజేపీ సర్కార్ పనిచేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ మల్లిఖార్జున్ ఖర్గే ఆరోపించారు.
న్యూఢిల్లీ: బీజేపీ ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని కాంగ్రెస్ ఎంపీ మల్లిఖార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) అన్నారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్లో బడ్జెట్‌పై చర్చ నిర్వహించకపోవడం బాధాకరమన్నారు. బీజేపీ ప్రభుత్వం అదానీ(Adani) ప్రయోజనాల కోసం పనిచేస్తోందని ఆయన విమర్శించారు. చర్చ లేకుండా బడ్జెట్‌ను ఆమోదించారన్నారు. 50 లక్షల కోట్ల బడ్జెట్‌ను చర్చ లేకుండా 12 నిమిషాల్లో ఆమోదించారని ఖర్గే అన్నారు.
అదానీ-హిండెన్‌బర్గ్‌పై చర్చించేందుకు మోదీ సర్కార్ ఎందుకు భయపడుతోందని కాంగ్రెస్ నేత ప్రశ్నించారు. పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వడం తప్ప.. ప్రధానికి ప్రజల బాధలు తెలియవన్నారు. పార్లమెంట్లో మేం మాట్లాడకుండా బీజేపీ అడ్డుకుందన్నారు. సభలో ప్రతిపక్షాలు మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు. దేశ సంపదను కాపాడేందుకు విపక్షాలన్నీ ఐక్యంగా పోరాడుతున్నాయని ఖర్గే తెలిపారు.రాహుల్ గాంధీ విషయంలో మెరుపు వేగంతో నిర్ణయం తీసుకున్నట్లు ఖర్గే ఆరోపించారు.
మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యం గురించి ఎక్కువగా మాట్లాడుతుందని, కానీ ఆ ప్రభుత్వ చర్యల్లో అది కనిపించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి పనిచేయడం తెలియదని, పాత రైళ్లకు కొత్త ఇంజిన్ తగిలిస్తున్నారని, ఆ రైలును ఓపెన్ చేసేందుకు భారీ స్పీచ్ ఇస్తున్నట్లు ఖర్గే ఆరోపించారు. ఓ రైలును ఆవిష్కరించేందుకు ప్రధాని అవసరం ఏముందని, దాని కోసం స్థానిక ఎంపీలు ఉంటారు కదా అని ఖర్గే ప్రశ్నించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

