సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Mar 11, 2020 , 18:32:52

బీజేపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే..

బీజేపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే..

న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, ఇందులో 9 స్థానాలు బీజేపీకి, మిగతా రెండు స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించింది. కొద్ది గంటల క్రితం పార్టీలో చేరిన జ్యోతిరాధిత్య సింధియాను రాజ్యసభకు పంపనుంది. మధ్యప్రదేశ్‌ నుంచి సింధియా పేరును బీజేపీ ప్రకటించింది. అసోం నుంచి ఇటీవల పార్టీలో చేరిన భువనేశ్వర్‌ కాలీతాకు అవకాశం దక్కింది. బీహార్‌ నుంచి వివేక్‌ ఠాకూర్‌, గుజరాత్‌ నుంచి అభయ్‌ భరద్వాజ్‌, రామిలాబెన్‌ బారా, జార్ఖండ్‌ నుంచి దీపక్‌ ప్రకాశ్‌, మణిపూర్‌ నుంచి లైసెంబా మహారాజా, మహారాష్ట్ర నుంచి ఉదయన్‌రాజే భోస్లే, రాజస్థాన్‌ నుంచి రాజేంద్ర గెహ్లాట్‌ పేర్లను బీజేపీ ప్రకటించింది. కాగా, మిత్రపక్షం తరపున కేంద్రమంత్రిగా కొనసాగుతున్న రామ్‌దాస్‌ అథవాలేకు మహారాష్ట్ర నుంచి అవకాశం కల్పించింది. అసోం నుంచి బిశ్వజిత్‌కు అవకాశం దక్కింది.


logo