Lok Sabha Elections 2024 | లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్న బీజేపీ, అకాలీదళ్
Lok Sabha Elections 2024 : రానున్న లోక్సభ ఎన్నికలకు పంజాబ్లో బీజేపీ, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) చేతులు కలపనున్నాయి.
Lok Sabha Elections 2024 : రానున్న లోక్సభ ఎన్నికలకు పంజాబ్లో బీజేపీ, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) చేతులు కలపనున్నాయి. ఈ పార్టీల మధ్య మళ్లీ పొత్తు చర్చలు ఊపందుకున్నాయి. పంజాబ్లోని 13 లోక్సభ స్ధానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది.
పంజాబ్లో బీజేపీ, ఎస్ఏడీ మధ్య పొత్తుపై చర్చలు జరుగుతున్నాయని బీజేపీ సీనియర్ నేత, పార్టీ ప్రతినిధి ఎస్ఎస్ చన్నీ తెలిపారు. ఇరు పార్టీల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి..మార్చి 22న అకాలీదళ్ కోర్ కమిటీ భేటీ జరగనుంది. పొత్తుపై అకాలీదళ్ నిర్ణయం అనంతరం బీజేపీ, ఎస్ఏడీ మధ్య లాంఛనప్రాయంగా చర్చలు సాగుతాయని, ఆపై పొత్తు ఖరారు అవుతుందని చన్నీ చెప్పారు.
పొత్తుపై తుది నిర్ణయం బీజేపీ అధిష్టానం తీసుకుంటుందని అన్నారు. ఇక తమ పార్టీ కోర్ కమిటీ సమావేశంలో ఎన్నికల పొత్తులు సహా అన్ని అంశాలపై చర్చిస్తామని అకాలీదళ్ సీనియర్ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ దల్జిత్ సింగ్ చీమా తెలిపారు. భావసారూప్యత కలిగిన పార్టీతో ఎన్నికల పొత్తు ఉండే అవకాశం ఉందని బీజేపీతో పొత్తుపై చీమా సానుకూల సంకేతాలు పంపారు.
Read More :
Couple Thrashed | షాకింగ్.. ఇంటి ముందు కారు పార్క్ చేశారని దంపతులపై దాడి.. VIDEO
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

