బిపిన్ రావత్ పార్దీవదేహానికి రేపు అంత్యక్రియలు

న్యూఢిల్లీ: హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్‌కు రేపు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన భౌతికకాయాన్ని ఇవాళ సాయంత్రం ఢిల్లీకి తీసుకురానున్నారు. తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఉన్న కూనూరు వద్ద హెలికాప్టర్ కుప్పకూలిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో 13 మంది మృతిచెందారు. దాంట్లో బిపిన్ రావత్ సతీమణి మధులిక కూడా ఉన్నారు. అయితే కోయంబత్తూరు నుంచి వాయుసేన ప్రత్యేక విమానంలో బిపిన్ రావత్ పార్దీవదేహాన్ని తరలించనున్నారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో రావత్ భౌతికకాయాన్ని ఉంచనున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల సందర్శనార్థం అక్కడ ఉంచుతామని అధికారులు ప్రకటించారు. కామరాజ్ మార్గ్ నుంచి ఢిల్లీ కంటోన్మెంట్‌లోని బ్రార్ స్వ్వేర్ శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర కొనసాగుతుందని తెలిపారు. సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని అధికారులు చెప్పారు. అయితే హెలికాప్టర్ కూలిన ఘటనపై ఇవాళ పార్లమెంట్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన చేయనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

