Polio Vaccine | హైదరాబాద్ బయోలాజికల్ ఈ పోలియో వ్యాక్సిన్‌కు ప్రీ క్వాలిఫికేషన్ హోదా ఇచ్చిన WHO..!
Polio Vaccine | హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ బయోలాజికల్-ఈ లిమిటెడ్ నోవెల్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ టైప్ 2 (nOPV2)కి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రీ-క్వాలిఫికేషన్ ఇచ్చింది. ఈ విషయాన్ని కంపెనీ మంగళవారం వెల్లడించింది.
Polio Vaccine | హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ బయోలాజికల్-ఈ లిమిటెడ్ నోవెల్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ టైప్ 2 (nOPV2)కి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రీ-క్వాలిఫికేషన్ ఇచ్చింది. ఈ విషయాన్ని కంపెనీ మంగళవారం వెల్లడించింది. నోటి ద్వారా వేసే వ్యాక్సిన్ పోలియో వైరస్ వ్యాప్తిని ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందని కంపెనీ పేర్కొంది. పోలియోపై పోరాటంలో కీలకమైందని.. వ్యాక్సిన్ పోలియో వైరస్ టైప్-2 వ్యాప్తి ముప్పును విజయవంతంగా ఎదుర్కొంటుందని తెలిపింది. వ్యాక్సిన్ మెరుగైన జన్యు స్థిరత్వాన్ని కలిగి ఉందని.. సబిన్ పోలియో వైరస్ టైప్-2 (mOPV2) వ్యాక్సిన్‌తో పోలిస్తే కొత్తగా వ్యాప్తి చెందే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందని చెప్పింది. ఈ సందర్భంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మహిమా దాట్ల స్పందిస్తూ పోలియో నిర్మూలనకు ప్రపంచవ్యాప్త ప్రయత్నంలో భాగమైనందుకు తాము సంతోషిస్తున్నామన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రీ క్వాలిఫికేషన్.. పోలియో నిర్మూలనలో తమ ప్రయత్నంలో కీలకమైన మైలురాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పీటీ బయోఫార్మాకు, గేట్స్ ఫౌండేషన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై పోలియో వినాశకరమైన ప్రభావాలతో ఏ ఒక్క పిల్లవాడు ప్రభావితం కాడని హామీ ఇస్తున్నామన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది పిల్లలు, కుటుంబాలకు ఆశాదీపంగా మారుతుందని.. పోలియో వ్యాప్తి చెందుతున్న ప్రాంతాల్లో బిలియన్ డోసుల వ్యాక్సిన్‌ను అందించడం ద్వారా పోలియో రహిత ప్రపంచం కలను సాకారం చేయడంలో చాలా కీలమన్నారు. ఇండోనేషియాలోని పీటీ బయోఫార్మా సహకారంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రీ క్వాలిఫికేషన్ పొందిన తయారీదారుగా నిలిచింది. పీటీ బయోఫార్మా నుంచి పీటీబీ సాంకేతికను పొందగా.. 500 మిలియన్ల కంటే ఎక్కువ మోతాదులను ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నది. వ్యాక్సిన్‌ను ఎగుమతి చేసేందుకు కంపెనీకి భారత డ్రగ్ నియంత్రణ సంస్థల నుంచి ఆమోదం సైతం పొందింది.
Read Also :
-
OROP | కేంద్ర ప్రభుత్వంపై ‘సుప్రీం’ ఆగ్రహం.. రూ.2లక్షల జరిమానా..!
-
Sanjay Raut | ప్రజాస్వామ్యానికి సంకెళ్లు : కాషాయ పాలకులపై భగ్గుమన్న సంజయ్ రౌత్
-
Wayanad | వయనాడ్ విలయం.. 600 మంది కార్మికులు గల్లంతు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

