ఇదేనా ‘సత్ప్రవర్తన’ అంటే!.. పెరోల్‌పై మూడేండ్లు బయటే బిల్కిస్ కేసు దోషులు
‘దోషులు 14 ఏండ్ల శిక్షాకాలం పూర్తి చేసుకున్నారు. జైలులో లేదా పెరోల్‌పై ఉన్నప్పుడు వారు సత్ప్రవర్తనతో నడుచుకున్నారు. తప్పులు చేశారనే దానికి ఎటువంటి ఆధారాలు లేవు. విడుదలకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం కూడా ఉన్నది’ ఇది బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం, కుటుంబసభ్యుల హత్య కేసులో 11 మంది దోషుల విడుదలను సమర్థించుకొంటూ గుజరాత్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ సారాంశం
- చంపేస్తామంటూ కీలక సాక్షులకు బెదిరింపులు
- పోలీసులకు బాధితుల ఫిర్యాదులు.. కేసుల నమోదు
- గుజరాత్ ప్రభుత్వ అఫిడవిట్ లొసుగులు బయటకు
న్యూఢిల్లీ, అక్టోబర్ 19: ‘దోషులు 14 ఏండ్ల శిక్షాకాలం పూర్తి చేసుకున్నారు. జైలులో లేదా పెరోల్‌పై ఉన్నప్పుడు వారు సత్ప్రవర్తనతో నడుచుకున్నారు. తప్పులు చేశారనే దానికి ఎటువంటి ఆధారాలు లేవు. విడుదలకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం కూడా ఉన్నది’ ఇది బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం, కుటుంబసభ్యుల హత్య కేసులో 11 మంది దోషుల విడుదలను సమర్థించుకొంటూ గుజరాత్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ సారాంశం. అయితే గుజరాత్ ప్రభుత్వం చెప్పిన దోషుల ‘మంచి ప్రవర్తన’ ఎంతమాత్రమో పెరోల్‌పై ఉన్న సమయంలో వారిపై నమోదైన కేసులు, పోలీసులకు అందిన ఫిర్యాదులను చూస్తే తెలుస్తున్నది. దోషులను విడుదల చేసేందుకు ‘సత్ప్రవర్తన’ అంటూ గుజరాత్ ప్రభుత్వం మసిపూసి మారేడు కాయ చేసిందనే చీకటి నిజం తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థ విచారణలో తేలింది. ముందస్తు విడుదలకు ముందు 11 మంది దోషులు వెయ్యి రోజులకు పైగా పెరోల్‌పై బయట ఉన్నారు. ఈ సమయంలో వారు సాక్షులను బెదిరించారని, వేధింపులకు గురిచేశారని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఎఫ్ఐఆర్లు కూడా నమోదయినట్టు వెల్లడైంది.
ఫిర్యాదులు.. ఎఫ్ఐఆర్లు..
- 2020, జూలై 6న దోషులు రాధేశ్యాం షా, మితేశ్ భట్‌పై దహోద్ జిల్లా రాధికాపూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. సాక్షి పింతూభాయ్ను బెదిరించారన్న ఆరోపణలపై కేసు నమోదైంది.
- 2021, జనవరి 1న శైలేశ్ చిమ్మాన్లాల్ భట్ అనే దోషి బెదిరిస్తున్నారంటూ అబ్దుల్ రజాక్ అనే మరో సాక్షి దహోద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు.
- అంతకుముందు 2017, జూలై 28న గోవింద్ నాయ్ అనే దోషిపై మరో ఇద్దరు సాక్షుల నుంచి పోలీసులకు ఫిర్యాదులు అందాయి. రాజీకి రాకుంటే చంపేస్తానని గోవింద్ బెదిరించాడని పేర్కొన్నారు.
రేపిస్టులనూ వదిలి పెడుతున్నారు: ఒవైసీ
న్యూఢిల్లీ: ఇప్పుడు దేశం చిరుతలను వదులుతున్నదన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలకు ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ గట్టి కౌంటర్ ఇచ్చారు. చిరుతలతో పాటు రేపిస్టులను కూడా వదిలిపెడుతున్నారని చురక అంటించారు. బుధవారం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ‘డిఫెన్స్ ఎక్స్పో-22’ను మోదీ ప్రారంభించారు. దేశ రక్షణ రంగ ఎగుమతులు గత ఎనిమిదేండ్లలో 8 రెట్లు పెరిగాయని మోదీ పేర్కొన్నారు. మేకిన్ ఇండియాతో అంతర్జాతీయంగా రక్షణ రంగంలో భారత పరపతి పెరుగుతున్నదని చెప్పేందుకు ప్రయత్నిస్తూ.. ఒకప్పుడు గాల్లోకి పావురాలను వదిలిన భారత దేశం నేడు చీతాలను వదిలే స్థాయికి ఎదిగిందన్నారు. దీనిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. మోదీ చెప్తున్నట్టుగా దేశం చీతాలతోపాటు రేపిస్టులను కూడా స్వేచ్ఛగా సమాజంలోకి వదిలిపెడుతున్నదని నిప్పులు చెరిగారు. బిల్కిస్ కేసులో దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని ప్రస్తావిస్తూ ఒవైసీ ఈ విమర్శలు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

