భోపాల్: ఒక బాలుడు తన తల్లితో కలిసి స్కూల్ బస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇద్దరు వ్యక్తులు బైక్‌పై అక్కడకు చేరుకున్నారు. తల్లి కంట్లో కారం చల్లి ఆ బాలుడ్ని కిడ్నాప్ చేశారు. (Boy Kidnaped) ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈ సంఘటన జరిగింది. మోరార్ ప్రాంతంలోని సీపీ కాలనీలో నివసించే రాహుల్ గుప్తా హోల్‌సేల్ వ్యాపారి. గురువారం ఉదయం కుమారుడైన ఆరేళ్ల బాలుడ్ని అతడి తల్లి బస్టాప్ వద్దకు తీసుకెళ్లింది. స్కూల్ బస్ కోసం వేచి ఉండగా ఇద్దరు వ్యక్తులు బైక్‌పై అక్కడకు చేరుకున్నారు. తల్లి కంట్లో కారంపొడి చల్లారు. ఆ బాలుడ్ని ఎత్తుకొని బైక్‌పై కూర్చోపెట్టుకుని అక్కడి నుంచి పారిపోయారు. తేరుకున్న ఆమె తన కుమారుడి కోసం పరుగెత్తింది.
కాగా, కుమారుడి కిడ్నాప్‌పై అతడి తండ్రి రాహుల్ గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ.30,000 రివార్డు ఇస్తామని ప్రకటించారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
‼️ अति महत्वपूर्ण सूचना ‼️🙏🙏
मुरार सीपी कॉलोनी, ग्वालियर में दिनदहाड़े बच्चे का अपहरण
बच्चे का नाम: शिवाय गुप्ता
पिता का नाम: राहुल गुप्ता
बदमाशों ने मिर्ची झोंककर माँ के सामने से बच्चे को उठा लिया।
पुलिस प्रशासन से निवेदन हैं इस पर जल्द कार्यवाही करें @Gwalior@GwaliorComm… pic.twitter.com/mKwlMvaxjN— मनीष सागर (@Manish_NSTA) February 13, 2025