Girl Child | 40 వేలకు 4 ఏండ్ల చిన్నారి.. అమ్మేసిన తల్లిదండ్రులు
నాలుగేండ్ల చిన్నారిని (Girl Child) రూ.40 వేలకు కన్న తల్లిందండ్రులే అమ్మేశారు. గుర్తించిన పోలీసులు ఆ బాలికను రక్షించారు. తల్లిదండ్రులతో పాటు మరో నలుగురిని ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. బీహార్‌కు చెందిన ఓ జంట.. ఒడిశాలోని భువనేశ్వర్ సమీపంలో ఉన్న బదగడ నివాసం ఉంటున్నారు.
భువనేశ్వర్: నాలుగేండ్ల చిన్నారిని (Girl Child) రూ.40 వేలకు కన్న తల్లిందండ్రులే అమ్మేశారు. గుర్తించిన పోలీసులు ఆ బాలికను రక్షించారు. తల్లిదండ్రులతో పాటు మరో నలుగురిని ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. బీహార్‌కు చెందిన ఓ జంట.. ఒడిశాలోని భువనేశ్వర్ సమీపంలో ఉన్న బదగడ నివాసం ఉంటున్నారు. వారికి నాలుగేండ్ల కుమార్తె ఉన్నది. రోజువారీ కూలీలుగా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే బుధవారం ఆ చిన్నారిని సంతానం లేని ఓ జంటకు రూ.40 వేలకు అమ్మేశారు. అయితే వారి ఇంటి యజమాని ఈ విషయాన్ని పోలీసులకు చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన ఖాకీలు.. పిప్లీ ప్రాంతంలో ఆ చిన్నారిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ఆమె తల్లిదండ్రులతో పాటు.. చిన్నారిని కొనుగోలు చేసిన జంటను, వారికి మధ్యవర్తుగా ఉన్న మరో ఇద్దరిని అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా ఆర్థిక ఇబ్బందులతో తమ కూతురిని అమ్మినట్లు వారు వెల్లడించారని బదగడ సీఐ సార్థక్ మహాదిక్ వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేశారని, దర్యాప్తు కొనసాగుతున్నదని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

