UIDAI-ISRO Portal: ఒక్క క్లిక్‌తో మీ దగ్గర్లో ఆధార్ కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవచ్చు!!
నగరాల్లో ఆధార్ కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవడం ఇప్పటివరకూ కష్టమైన పని. ఇకపై ఒక్క క్లిక్‌తో ఆ సమాచారం తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఆధార్ జారీ చేసే సంస్థ యూఐడీఏఐ, ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) దేశమంతటా ఆధార్ కేంద్రాల సమాచారం, లొకేషన్ తెలిపే “భువన్ ఆధార్” పోర్టల్‌ను ప్రారంభించేందుకు సాంకేతిక సహకారం కోసం ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందంపై యూఐడీఏఐ, ఎన్ఆర్ఎస్సీ (హైదరాబాద్), ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖ సంతకాలు చేశాయి. ఈ కార్యక్రమంలో యూఐడీఏఐ, ఎన్ఆర్ఎస్సీ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

మీ సమీప ఆధార్ సేవా కేంద్రాన్ని ఎలా తెలుసుకోవాలి?
https://bhuvan.nrsc.gov.in/aadhaar/ని సందర్శించండి
స్క్రీన్ ఎడమ వైపున నాలుగు డ్రాప్-డౌన్ ఆప్షన్స్ ఉంటాయి.
సమీపంలోని ఆధార్ సేవా కేంద్రాన్ని గుర్తించడానికి ‘సెంటర్స్ నియర్ బై’ ఆప్షన్‌ను ఎంచుకోండి.
మీ స్థానం లేదా నగరాన్ని నమోదు చేయడం ద్వారా మీ సమీప ఆధార్ కేంద్రాన్ని గుర్తించండి.
‘సెర్చ్ బై ఆధార్ సేవా కేంద్ర’ ఆప్షన్ ద్వారా కూడా సమీప ఆధార్ కేంద్రాన్ని తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఆధార్ సేవా కేంద్రం పేరును ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
‘సెర్చ్ బై పిన్‌కోడ్’ అనే మూడో ఆప్షన్ ద్వారా కూడా సమీప ఆధార్ కేంద్రాన్ని తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీ పిన్‌కోడ్ నంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
‘స్టేట్ వైస్ ఆధార్ సేవా కేంద్ర’ అనే నాలుగో ఆప్షన్ ద్వారా మీ జిల్లా లేదా రాష్ట్రంలోని ఆధార్ సేవా కేంద్రాల జాబితా తెలుసుకోవచ్చు. ఇందుకోసం రాష్ట్రం, జిల్లా, కేంద్రం రకంలాంటి వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video