నేడు గుజరాత్ 18వ సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణం
Bhupendra Patel | గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర భాయ్ పటేల్ మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. తాజా జరిగిన ఎన్నికల్లో
గాంధీనగర్: గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర భాయ్ పటేల్ మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. తాజా జరిగిన ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోనే బీజేపీ చారిత్రక విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి పార్టీ అధిష్ఠానం ఆయనకే పాలనా పగ్గాలు అప్పజెప్పింది. ఈనేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా భూపేంద్ర ప్రమాణం చేయనున్నారు. గాంధీనగర్‌లోని కొత్త సెక్రటేరియట్ భవనంలో గవర్నర్ దేవవ్రత్ ఆయనతో ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.
రెండు విడుతల్లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 156 సీట్లను హస్తగతం చేసుకున్నది. ఇక కాంగ్రెస్ 17 స్థానాలకే పరిమితమవగా, ఆప్ 5 ఎమ్మెల్యేలను గెలుపొందింది. ఇక సీఎం భూపేంద్ర పటేల్.. అహ్మదాబాద్ జిల్లాలోని ఘట్లోడియా స్థానం నుంచి 1.92 లక్షలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bhupendra Patel
- BJP
- CM
- Gandhinagar
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

