ముంబై: భోజ్‌పురి నటి(Bhojpuri Actress) సుమన్ కుమారిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. మహిళా మోడల్స్‌ను అక్రమంగా వ్యభిచారం ఊబిలోకి దించుతున్నట్లు ఆ 24 ఏళ్ల నటిపై ఆరోపణలు ఉన్నాయి. సుమాన్ కుమారి ట్రాప్ చేసిన ముగ్గురు మహిళలను పోలీసులు రక్షించారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.