Bharat Rice | మార్కెట్లోకి ‘భారత్ రైస్’.. ప్రారంభించిన కేంద్రమంత్రి.. ఎక్కడ కొనాలంటే..!
Bharat Rice | ఈ ఏడాది దేశంలో బియ్యం ధరలు భారీగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం ‘భారత్ రైస్’ పేరుతో రాయితీపై బియ్యం అమ్మకాలకు శ్రీకారం చుట్టింది. ఇవాళ (మంగళవారం) సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ఈ సబ్సిడీ బియ్యం అమ్మకాలను ప్రారంభించారు.
Bharat Rice | ఈ ఏడాది దేశంలో బియ్యం ధరలు భారీగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం ‘భారత్ రైస్’ పేరుతో రాయితీపై బియ్యం అమ్మకాలకు శ్రీకారం చుట్టింది. ఇవాళ (మంగళవారం) సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ఈ సబ్సిడీ బియ్యం అమ్మకాలను ప్రారంభించారు.
ఈ రాయితీ బియ్యాన్ని వినియోగదారులకు కిలో రూ.29కే అందజేయనున్నారు. ఇవాళ్టి నుంచి ఎన్ఏఎఫ్ఈడీ (NAFED), ఎన్సీసీఎఫ్ (NCCF), కేంద్రీయ భండార్ సహా అన్ని ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ బియ్యాన్ని అందుబాటులో ఉంచనున్నారు. ఈ ప్యాక్ చేసిన బియ్యం 5 కిలోలు, 10 కిలోల బ్యాగులలో లభ్యమవుతాయి.
దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి కేంద్రం తొలుత ‘భారత్ బ్రాండ్’ కింద తక్కువ ధరకు గోధుమ పిండి, పప్పులు, ఉల్లిపాయలు, టమోటాల విక్రయాలను ప్రారంభించింది. ‘భారత్ ఆటా’ను 2023 నవంబరు 6న మార్కెట్లోకి తీసుకొచ్చింది.
కాగా, తొలి దశలో 5 లక్షల టన్నుల భారత్ బ్రాండ్ బియ్యాన్ని విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. గత ఏడాదితో పోలిస్తే బియ్యం రిటైల్ ధరలు 13.8 శాతం, హోల్‌సేల్ ధరలు 15.7 శాతం పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు సరసమైన ధరలకే బియ్యం అందించాలనే ఉద్దేశంతో కేంద్రం భారత్ రైస్‌ను తీసుకువచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Marco Rubio | అమెరికాలోనూ నిత్యం నిరసనలు జరుగుతాయ్.. భారత్‌లో నిరసనలపై మార్కో రూబియో
woman kills twin sons | ప్రియుడు అంగీకరించలేదని.. కవల కుమారులను చంపిన మహిళ
కోట మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తజనం
బంగారు ఆభరణాల కోసం వృద్ధురాలి హత్య
MLC Botsa | ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదు..కేంద్రబలగాలను రప్పించాలి : ఎమ్మెల్సీ బొత్స
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

