ఎల్బెండాజోల్ మందులు వేసుకొని… 80 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత..
బిహార్‌లోని భాగల్పూర్, ముంగేర్ పాఠశాల పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నులి పురుగు నివారణా మందులను పాఠశాల యాజమాన్యం ఉచితంగా పంపిణీ చేసింది. ఈ మందు తీసుకున్న 80 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొందరు స్పృహ తప్పి కింద పడిపోయారు. ఈ 80 మందిలో ప్రస్తుతం 12 మంది విద్యార్థులు వెంటిలేటర్‌పై వున్నారు. దీంతో తల్లిదండ్రులు పాఠశాలల ముందు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. వైద్య సిబ్బందిని ఓ గదిలో బంధించారు. . ఈ ఘటనను చూసి, ఉపాధ్యాయులు అక్కడి నుంచి పారిపోయారు. ఇక.. అస్వస్థతకు గురైన విద్యార్థులను దగ్గర్లోని ఆస్పత్రిలో చేర్పించారు.
పిల్లలకు ఎల్బెండాజోల్ అనే మందును ఇవ్వడానికి వైద్యాధికారులు పాఠశాలలకు వచ్చారు. ఈ మందును తీసుకోగానే.. దాదాపు 80 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 30 మంది పిల్లలు అప్పటికప్పుడే వాంతులు, విరేచనాలు చేసుకుంటూ, స్పృహ తప్పిపడిపోయారు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో.. పాఠశాలలకు చేరుకొని, వైద్య సిబ్బందిని బంధించారు. చివరికి… ఉన్నతాధికారులు అక్కడికి చేరుకొని, వైద్య సిబ్బందిని విడిపించారు. పిల్లలను ఆస్పత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ram Charan | మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ .. రామ్ చరణ్ – సుకుమార్ RC17 రిలీజ్ డేట్ ఫిక్స్?
Road Accident | దైవ దర్శనానికి వెళ్తూ యాక్సిడెంట్.. 13 మంది మృతి
Ramayana | సీత పాత్రపై విమర్శలు.. నెగిటివిటీపై లేడీ పవర్‌స్టార్ అదిరిపోయే సమాధానం!
IND vs NZ | బుమ్రా దెబ్బకు లాథమ్ ఔట్.. టీ బ్రేక్‌కు కివీస్ స్కోర్ ఇదే
Bigg Boss 10 | వర్షిణి కన్నీళ్లు.. అమన్, ముఖేష్‌లకు నాగార్జున గట్టి క్లాస్,త్రిగుణ్‌కు షాక్!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

