Building collapse | బెంగళూరులో భవనం కుప్పకూలిన ఘటన.. ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు
Building collapse | కర్ణాటక రాజధాని బెంగళూరులో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలిన ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురు బాధ్యులపై కేసులు నమోదు చేశారు. భవనం యజమాని మునిరాజరెడ్డి, మోహన్‌రెడ్డి, ఏలుమలై అనే వ్యక్తులపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినట్లు హన్నూర్ పోలీసులు తెలిపారు.
Building collapse : కర్ణాటక రాజధాని బెంగళూరులో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలిన ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురు బాధ్యులపై కేసులు నమోదు చేశారు. భవనం యజమాని మునిరాజరెడ్డి, మోహన్‌రెడ్డి, ఏలుమలై అనే వ్యక్తులపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినట్లు హన్నూర్ పోలీసులు తెలిపారు. నిందితులపై బృహత్ బెంగళూరు మహానగర పాలక సంస్థ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిట్లు వెల్లడించారు.
ప్రస్తుతం భవన యజమాని మునిరాజరెడ్డి కుమారుడు భువన్‌రెడ్డి, కాంట్రాక్టర్ యునియప్ప తమ అదుపులో ఉన్నారని బెంగళూరు ఈస్ట్ డీసీపీ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. కాగా మంగళవారం సాయంత్రం బెంగళూరులో నిర్మాణంలో ఉన్న నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. దాంతో పలువురు కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నారు. పోలీసులు, రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. కొందరు సురక్షితంగా బయటపడగా.. ముగ్గురు మృతిచెందారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

