Bengaluru Rains | బెంగళూరులో భారీ వర్షం.. అండర్‌పాస్‌లో చిక్కుకున్న కారు..!
Bengaluru Rains | కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు, వడగళ్లతో వర్షం కురవడంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో బెంగళూరులో భారీ కారు మేఘాలు కమ్మేయడంతో పాటు కుండపోతగా వర్షం కురవడంతో వాహనదారులు రోడ్లపైనే వాహనాలను నిలిపివేశారు.
Bengaluru Rains | కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు, వడగళ్లతో వర్షం కురవడంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో బెంగళూరులో భారీ కారు మేఘాలు కమ్మేయడంతో పాటు కుండపోతగా వర్షం కురవడంతో వాహనదారులు రోడ్లపైనే వాహనాలను నిలిపివేశారు. అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో బెంగళూరు సహా సలు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. బెంగళూరు విధానసౌధ, ఆనంద్ రావు, మెజెస్టిక్, రేస్ కోర్స్, కేఆర్ సర్కిల్, టౌన్ హాల్, కార్పొరేషన్, మైసూర్ బ్యాంక్ సర్కిల్, జయనగర్, మల్లీశ్వర్ సహా పలు ప్రాంతాల్లో వర్షానికి భారీగా వరద నీరు చేరింది.

మల్లేశ్వర, కేఆర్‌సర్కిల్‌లో వడగళ్ల కురిశాయి. ఈదురు గాలులకు కేఆర్‌సర్కిల్, సర్ ఎం విశ్వేశ్వరయ్య యూనివర్సిటీ, ఆనంద్‌రావు సర్కిల్ వీవీ దాస్ హోటల్ ఎదుట చెట్లు నేలకూలాయి. హోటల్ వద్ద చెట్టు నేలకూలడంతో కారు నుజ్జునుజ్జు అయ్యింది. అయితే, ఆ సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. కుమార్ కృపా రోడ్డులోని చిత్రకళా పరిషత్ ఎదురుగా కారు, బైక్‌పై చెట్లకొమ్మలు విరిగిపడడంతో వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ సమయంలో కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్రగాయాలయ్యాయి. కేఆర్‌సర్కిల్ వద్ద వర్షపు నీటిలో కారు చిక్కుకుపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని.. సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

