Traffic Challan | ఫుట్‌పాత్‌పై బైక్ నడిపితే రూ.5 వేలు.. వన్‌వేలో వెళ్తే రూ.10 వేల ఫైన్? బెంగళూరులో కఠినంగా ట్రాఫిక్ రూల్స్!!
Traffic Challan | బెంగళూరులో ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినతరం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఫుట్‌పాత్‌లపై బైకులు నడిపితే రూ.500 ఉన్న ఫైన్‌ను రూ.5వేలకు పెంచనున్నారు. వన్‌వేపై వెళ్తే వేసే వెయ్యి జరిమానాను రూ.10వేలకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నది.
Traffic Challan | బెంగళూరు : బెంగళూరులో ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినతరం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. సగం హెల్మెట్ ధరించే వాళ్లపై ఫైన్లు వేయడంతో పాటు వాటిని అమ్ముతున్న వారిపై, తయారీదారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధం అవుతున్నది. అలాగే ఫుట్‌పాత్‌లపై బైకులు నడిపితే రూ.500 ఉన్న ఫైన్‌ను రూ.5వేలకు పెంచనున్నారు. వన్‌వేపై వెళ్తే వేసే వెయ్యి జరిమానాను రూ.10వేలకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ మేరకు రాష్ట్ర రవాణా, హోం శాఖలు సమర్పించిన ప్రతిపాదనలపై ప్రభుత్వం పరిశీలన జరుపుతున్నది.
బుధవారం విధానసౌధలో హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే, రవాణా మంత్రి బి. సురేశ్ ఉన్నతాధికారులతో సంయుక్త సమీక్ష నిర్వహించారు. బెంగళూరులో ట్రాఫిక్ రద్దీ తగ్గించడం, రోడ్డు భద్రతను మెరుగుపరచడం, పదేపదే నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంపై చర్చించారు. ఫుట్‌పాత్‌లపై వాహనాల నడపడం, వన్‌వే ఉల్లంఘనలు, అక్రమ పార్కింగ్, నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాల నిలుపుదల, సిగ్నల్ ఉల్లంఘనలపై జరిమానాలు పెంచే ప్రతిపాదనలూ సమావేశంలో చర్చకు వచ్చాయి.
ప్రస్తుతం ఫుట్‌పాత్‌పై ద్విచక్ర వాహనం నడిపితే విధిస్తున్న రూ.500 జరిమానాను మొదటిసారి ఉల్లంఘనకు రూ.5,000కు, రెండోసారి ఉల్లంఘిస్తే రూ.10,000కు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. వన్‌వే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేవారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ప్రస్తుతం ఈ ఉల్లంఘనకు రూ.1,000 జరిమానా ఉండగా.. దాన్ని పదిరెట్లు పెంచి రూ.10,000కు చేర్చాలని ప్రతిపాదించింది. రవాణా, హోం శాఖలు ఈ మేరకు ప్రతిపాదనలు సమర్పించాయి. న్యాయశాఖ అభిప్రాయం తీసుకున్న తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నది.
పదేపదే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులపై మరింత కఠినంగా వ్యవహరించేందుకు పాయింట్ల ఆధారిత డ్రైవింగ్ లైసెన్స్ విధానాన్ని తీసుకురావడంపైనా అధికారులు చర్చించారు. వివిధ రకాల ఉల్లంఘనలకు నిర్దిష్ట పాయింట్లు కేటాయిస్తారు. ఒక డ్రైవర్ నిర్దేశిత పరిమితికి చేరుకుంటే అతడి డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ విధానం అమలుకు అవసరమైన చట్టపరమైన అంశాలపైనా సమీక్షించారు.
రవాణా శాఖకు చెందిన సారథి వ్యవస్థను బెంగళూరు ట్రాఫిక్ పోలీసుల ఈ-చలాన్ వ్యవస్థతో అనుసంధానించే అంశాన్ని కూడా పరిశీలించారు. దీనివల్ల వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటును పోలీసులు అక్కడికక్కడే తనిఖీ చేయగలుగుతారు. గతంలో చేసిన ట్రాఫిక్ ఉల్లంఘనల వివరాలనూ తెలుసుకోవచ్చు. కొత్తగా నమోదయ్యే ఉల్లంఘనలను నేరుగా డ్రైవర్ డిజిటల్ రికార్డుకు అనుసంధానించవచ్చు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

