Prakash Raj | ఓటర్ ఐడీల కేసు.. నటుడు ప్రకాష్‌రాజ్‌కు నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్
Prakash Raj | ప్రముఖ బహుభాషా నటుడు (Actor), సామాజిక రాజకీయ విమర్శకుడు ప్రకాష్‌రాజ్ (Prakashraj) చుట్టూ వివాదం నెలకొన్నది. ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఓటరు గుర్తింపు కార్డులు (Voter IDs) ఉండకూడదనే ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారనే కేసులో ఆయనకు గట్టి షాక్ తగిలింది. బెంగళూరు (Bengalore) లోని 48వ ఏసీజేఎం (ACJM) కోర్టు శనివారం ప్రకాష్‌రాజ్‌కు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీచేస్తూ సంచలన ఆదేశాలు ఇచ్చింది.
Prakash Raj : ప్రముఖ బహుభాషా నటుడు (Actor), సామాజిక రాజకీయ విమర్శకుడు ప్రకాష్‌రాజ్ (Prakashraj) చుట్టూ వివాదం నెలకొన్నది. ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఓటరు గుర్తింపు కార్డులు (Voter IDs) ఉండకూడదనే ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారనే కేసులో ఆయనకు గట్టి షాక్ తగిలింది. బెంగళూరు (Bengalore) లోని 48వ ఏసీజేఎం (ACJM) కోర్టు శనివారం ప్రకాష్‌రాజ్‌కు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీచేస్తూ సంచలన ఆదేశాలు ఇచ్చింది. వివరాల్లోకి వెళితే… ప్రకాష్‌రాజ్‌కు ఒకే సమయంలో నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నాయంటూ 2019లో దిలీప్ కుమార్ అనే న్యాయవాది బెంగళూరు హలసూరు గేట్ పోలీస్ స్టేషన్లో తొలిసారి ఫిర్యాదు చేశారు.
కర్ణాటక, తెలంగాణ, తమిళనాడుతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆయనకు ఓటు హక్కు ఉందని, ఇది ముమ్మాటికీ ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం చట్టవిరుద్ధమని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ అక్రమ ఓట్ల వ్యవహారంపై బృహత్ బెంగళూరు మహానగర పాలిక అధికారులకు, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేకపోవడంతో సదరు న్యాయవాది ఏకంగా కోర్టును ఆశ్రయించారు. ఈ ప్రైవేట్ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం గత కొన్ని విచారణలుగా కోర్టుకు స్వయంగా హాజరుకావాలంటూ ప్రకాష్‌రాజ్‌కు సమన్లు జారీచేసింది.
అయితే కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రకాష్‌రాజ్ వరుసగా కోర్టు విచారణలకు గైర్హాజరవుతూ వచ్చారు. కోర్టు సమన్లు లైట్ తీసుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి.. ఈసారి ఆయనకు ఎలాంటి బెయిల్ దొరకకుండా నేరుగా నాన్‌బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేశారు. దాంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

