Bengalore | సినిమా చూస్తుండగా కూలిన థియేటర్ పైకప్పు.. ముగ్గురికి గాయాలు..!
Bengalore | కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengalore) లోని ఓ సినిమా థియేటర్లో అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. ప్రేక్షకులు సినిమా చూస్తుండగానే పైకప్పులోని కొంత భాగం హఠాత్తుగా కూలిపోవడంతో ముగ్గురు గాయపడ్డారు. ఈ ప్రమాదం పీణ్య (Peenya) లోని భారతి థియేటర్ (Bharati Theater) లో బుధవారం జరిగింది.
Bengalore : కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengalore) లోని ఓ సినిమా థియేటర్లో అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. ప్రేక్షకులు సినిమా చూస్తుండగానే పైకప్పులోని కొంత భాగం హఠాత్తుగా కూలిపోవడంతో ముగ్గురు గాయపడ్డారు. ఈ ప్రమాదం పీణ్య (Peenya) లోని భారతి థియేటర్ (Bharati Theater) లో బుధవారం జరిగింది. భారీ వర్షం కురుస్తున్న సమయంలో థియేటర్లో సినిమా ప్రదర్శన కొనసాగుతున్నది. అదే సమయంలో పైకప్పుకు సంబంధించిన ప్లాస్టరింగ్, ఆస్ఫాల్టిక్ షీట్లు ఒక్కసారిగా ఊడి ప్రేక్షకులపై పడ్డాయి.
ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. వారిని తక్షణమే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ప్రాణాపాయం లేదని తెలుస్తున్నది. ప్రమాదం జరిగిన వెంటనే థియేటర్ సిబ్బంది అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. కూలిన పైకప్పు భాగానికి తాత్కాలికంగా మరమ్మతులు చేసి, సినిమా ప్రదర్శనను తిరిగి కొనసాగించారు. అయితే ఈ ఘటనతో అసౌకర్యానికి గురై వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న ప్రేక్షకులకు యాజమాన్యం టికెట్ ధరను తిరిగి చెల్లించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

