కరోనా కేసులు తగ్గుముఖం : ఊపిరి పీల్చుకుంటున్న బెంగళూర్

బెంగళూర్ : కరోనా హాట్ స్పాట్ గా మారి నగర ప్రజలకు కంటికి మీద కునుకులేకుండా చేసిన మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పట్టడం ఊరట ఇస్తోంది. కేసుల సంఖ్య తగ్గడంతో దవాఖానల్లో చేరే వారి సంఖ్య పడిపోవడం ఫలితంగా ఆక్సిజన్ పడకలకు డిమాండ్ అనూహ్యంగా తగ్గింది. మే 10 నుంచి బెంగళూర్ లో తాజా పాజిటివ్ కేసుల సంఖ్య దిగిరావడంతో అధికారులు ఊపిరిపీల్చుకుంటున్నారు.
మే 17న 13,000 పాజిటివ్ కేసులు వెలుగుచూడగా మే తొలివారంతో పోలిస్తే వీటి సంఖ్య అత్యల్పం. ఏప్రిల్ 30 నుంచి మే 6 మధ్య 30.6 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు కూడా దిగివచ్చింది. గత వారం, పదిరోజుల కిందటి పరిస్థితితో పోలిస్తే బెంగళూర్ లో పడకల కొరత గణనీయంగా తగ్గుముఖం పట్టిందని రీగల్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సూరిరాజు పేర్కొన్నారు.
ఆక్సిజన్ పడకలు సైతం రోగులకు సులభంగా దొరుకుతున్నాయని చెప్పారు. నగరంలో ఆక్సిజన్ పడకల సంఖ్య పెరగడం కూడా ఇందుకు ఓ కారణమని ఆయన చెప్పుకొచ్చారు. గత కొద్దిరోజులుగా మరణాల సంఖ్య కూడా తగ్గిందని స్మశాన వాటికలు, అంత్యక్రియల వద్ద పనిచేసే వాలంటీర్ల నుంచి వచ్చిన సమాచారం వెల్లడిస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bangalore
- Covid-19
- Oxygen beds
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

