బెంగాల్ హింస: త్రిసభ్య కమిటీ వేసిన కోల్‌కతా హైకోర్టు
Committee on Bengal violence: బాధితులు తమకు హక్కులు కలిగిన ప్రాంతాల్లో ఉండేందుకు వీలుగా పోలీసుల సమన్వయంతో కమిటీ తగిన ఏర్పాట్లు చేస్తుందని కోర్టు పేర్కొన్నది.

కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన అనంతరం చెలరేగిన హింసతో బాధితులుగా మారిన వారికి పునరావాసం కల్పించడానికి సంబంధించి కోల్‌కతా హైకోర్టు సోమవారం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్, మెంబర్ సెక్రెటరీ అండ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి ఒక్కొక్కరు ఈ కమిటీలో ఉంటారు.
బాధితులు తమకు హక్కులు కలిగిన ప్రాంతాల్లో ఉండేందుకు వీలుగా పోలీసుల సమన్వయంతో కమిటీ తగిన ఏర్పాట్లు చేస్తుందని కోర్టు పేర్కొన్నది. ఎన్నికల అనంతర హింసపై విచారణ కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై కోల్‌కతా హైకోర్టుకు చెందిన ఐదుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం విచారణ జరిపింది. మే 2న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం వివిధ ప్రాంతాల్లో హింస చెలరేగింది. పలువురు తమ నివాసాలు విడిచి పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

