బెంగాల్ అల్లర్లు : ప్రధాన కార్యదర్శికి గవర్నర్ సమన్లు

కోల్ కతా : పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల అనంతర హింసాకాండ నేపథ్యంలో శాంతి భద్రతల పరిస్థితిని తనకు సమగ్రంగా నివేదించాలని కోరుతూ గవర్నర్ జగ్దీప్ దంకర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి శనివారం సమన్లు జారీ చేశారు. అల్లర్లకు సంబంధించి తనకు అదనపు ముఖ్య కార్యదర్శి హెచ్ ఎస్ ద్వివేది తనకు ఎలాంటి సమాచారం అందించలేదని డీజీపీ, కోల్ కతా పోలీస్ కమిషనర్ లు మే 3న తనకు పంపిన నివేదికలను తొక్కిపెట్టారని ఆయన మండిపడ్డారు.
ఎన్నికల అనంతర హింసపై తనకు సమగ్రంగా వివరించేందుకు శనివారం సాయంత్రం ఏడు గంటలలోగా తనను కలిసి నివేదించాలని గవర్నర్ జగ్దీప్ దంకర్ ట్వీట్ చేశారు. అదనపు ముఖ్యకార్యదర్శి ద్వివేది విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం కనబరిచారని, డీజీపీ, పోలీస్ కమిషనర్ల నివేదికలను తనకు సమర్పించకపోవడం పట్ల ఆయన తీరును గవర్నర్ తప్పుపట్టారు. ఎన్నికల అనంతర హింసపై రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

