Bengal BJP MLA | బెంగాల్లో బీజేపీకి ఝలక్.. ఇండిపెండెంట్గా పోటీ చేస్తానన్న ఆ పార్టీ ఎమ్మెల్యే
Bengal BJP MLA | పశ్చిమ బెంగాల్లో బీజేపీకి ఆ పార్టీ ఎమ్మెల్యే ఝలక్ ఇచ్చారు. బీజేపీ ప్రకటించిన లోక్సభ అభ్యర్థికి వ్యతిరేకంగా గళమెత్తారు. సొంత పార్టీ అభ్యర్థిపై ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని వెల్లడించారు.
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో బీజేపీకి ఆ పార్టీ ఎమ్మెల్యే ఝలక్ ఇచ్చారు. (Bengal BJP MLA) బీజేపీ ప్రకటించిన లోక్సభ అభ్యర్థికి వ్యతిరేకంగా గళమెత్తారు. సొంత పార్టీ అభ్యర్థిపై ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని వెల్లడించారు. బీజేపీకి చెందిన కుర్సియోంగ్ ఎమ్మెల్యే బిష్ణు ప్రసాద్ శర్మ ఈ మేరకు సోమవారం ప్రకటించారు. డార్జిలింగ్ లోక్సభ స్థానంలో రాజు బిస్టాను బీజేపీ తిరిగి నామినేట్ చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంతో సంబంధం లేని బయట వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించడంపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో తాను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని తెలిపారు. ‘రాజు బిస్తా నా అభ్యర్థి కాదు. మాకు బయటి వ్యక్తి అక్కర్లేదు. ఈ భూమికి చెందిన పుత్రుడు బీజేపీకి దొరకకపోవడం దురదృష్టకరం’ అని విమర్శించారు.
కాగా, ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నప్పటికీ తాను బీజేపీలోనే ఉంటానని ఆ పార్టీ ఎమ్మెల్యే బిష్ణు ప్రసాద్ శర్మ తెలిపారు. సొంతంగా పార్టీతో తెగతెంపులు చేసుకునే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. అయితే పార్టీ తనపై ఎలాంటి క్రమశిక్షణ చర్య అయినా తీసుకోవచ్చని అన్నారు.
మరోవైపు ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతుగా గళమెత్తిన బిష్ణు ప్రసాద్ శర్మ, 2009 నుంచి డార్జిలింగ్ లోక్సభ స్థానంలో బీజేపీ సాధించిన చారిత్రక విజయాన్ని ప్రస్తావించారు. అయితే డార్జిలింగ్ ప్రాంతానికి చెందని వ్యక్తిని బీజేపీ నామినేట్ చేయడం ఇది నాల్గవసారి అని మండిపడ్డారు. అలాంటి అభ్యర్థులు స్థానిక ప్రజల నిజమైన సమస్యలను లేవనెత్తలేరని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

