Bulldozers | ఎస్పీ కంచుకోటలో.. బుల్డోజర్లతో సీఎం యోగి ఎన్నికల ర్యాలీ
Bulldozers | ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) కంచుకోటలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. సుమారు మూడు కిలోమీటర్ల వరకు సాగిన రోడ్ షోలో యోగి పాలనలో మార్కుగా నిలిచిన బుల్డోజర్లు (Bulldozers) కూడా పాల్గొన్నాయి.
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) కంచుకోటలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. సుమారు మూడు కిలోమీటర్ల వరకు సాగిన రోడ్ షోలో యోగి పాలనలో మార్కుగా నిలిచిన బుల్డోజర్లు (Bulldozers) కూడా పాల్గొన్నాయి. ఎస్పీ వ్యవస్థాపకుడు, దివంగత ములాయం సింగ్ యాదవ్ స్వస్థలమైన మెయిన్‌పురిలో బీజేపీ అభ్యర్థి జైవీర్ సింగ్‌కు మద్దతుగా సీఎం యోగి ఆదిత్యనాథ్ రోడ్ షో నిర్వహించారు. సుమారు పద్నాలుగు బుల్డోజర్లు కూడా ఈ రోడ్ షోలో పాల్గొన్నాయి.
కాగా, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ మెయిన్‌పురి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. రెండేళ్ల కిందట ములాయం సింగ్ యాదవ్ మరణం నేపథ్యంలో జరిగిన ఉప ఎన్నికల్లో సుమారు 3 లక్షల మెజార్టీతో బీజేపీ అభ్యర్థిపై ఆమె గెలిచారు.
మరోవైపు1996 నుంచి మెయిన్‌పురి లోక్‌సభ నియోజకవర్గంలో ఎస్పీ ఎప్పుడూ ఓడిపోలేదు. దీంతో ఈ స్థానం ఎస్పీకి కంచుకోటగా నిలిచింది. అయితే 2022 అసెంబ్లీ ఎన్నికల్లో మెయిన్‌పురి జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను రెండింటిని బీజేపీ గెలుచుకుంది. తాజా లోక్‌సభ ఎన్నికల్లో మెయిన్‌పురి స్థానంపై బీజేపీ దృష్టిసారించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bulldozers
- Mainpuri
- Road show
- UP CM
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

