Baryl Vanneihsangi: ఇన్స్టాగ్రామ్ పాపులర్ అమ్మాయి.. ఇప్పుడు మిజోరం ఎమ్మెల్యే
Baryl Vanneihsangi: మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో .. జోరం పీపుల్స్ మూమెంట్ పార్టీ తరపున 32 ఏళ్ల బారిల్ వన్నెసంగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ రాష్ట్రానికి ఎన్నికైన యువ మహిళా ఎమ్మెల్యేగా ఈమె రికార్డు క్రియేట్ చేసింది. ఐజ్వాల్ సౌత్-3 నియోజకవర్గం నుంచి బారిల్ గెలుపొందారు. 1414 ఓట్ల తేడాతో ఆమె విజయం సాధించారు.
న్యూఢిల్లీ: అందమైన ఈ అమ్మాయిని చూశారా. ఈమె మోడల్ కాదు.. ఇప్పుడు ఎమ్మెల్యే. మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో .. జోరం పీపుల్స్ మూమెంట్ పార్టీ తరపున ఆమె విక్టరీ కొట్టారు. 32 ఏళ్ల ఈమె పేరు బారిల్ వన్నెసంగి(Baryl Vanneihsangi). మిజోరం యువ మహిళ ఎమ్మెల్యేగా ఈమె రికార్డు క్రియేట్ చేసింది. ఐజ్వాల్ సౌత్-3 నియోజకవర్గం నుంచి బారిల్ గెలుపొందారు. 1414 ఓట్ల తేడాతో ఆమె విజయం సాధించారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో వన్నెసంగి చాలా పాపులర్. షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్ట్రన్ హిల్ యూనివర్సిటీ లో ఆమె ఆర్ట్స్ లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. గతంలో ఆమె రేడియో జాకీగా చేశారు. టెలివిజన్ ప్రజెంటర్‌గా కూడా చేసిందామె. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 2.5 లక్షల మంది ఫాలోవర్లు కూడా ఉన్నారు.
లింగ సమానత్వం కోసం కొత్తగా ఎన్నికైన బారిల్ చాన్నాళ్ల నుంచి పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ వ్యవస్థలోకి మహిళలు పెద్ద సంఖ్యలో రావాలన్న నినాదాన్ని ఆమె వినిపించారు. మిజోరం ఎన్నికల్లో ఈసారి ముగ్గురు మహిళలు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ రాష్ట్రంలో మొత్తం 40 స్థానాలు ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

