రేపటి నుంచి సాయంత్రం 5 గంటల వరకు బ్యాంకులు.. ఎక్కడంటే?

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో బ్యాంకులు సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తాయి. ఈ నెల రెండో తేదీ గురువారం నుంచి ఇది అమలులోకి వస్తుందని సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఈ మేరకు బ్యాంకు పని గంటలను గతంలో మాదిరిగా పొడిగించినట్లు చెప్పారు. కరోనా నేపథ్యంలో బెంగాల్లో బ్యాంకులు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే పని చేస్తున్నాయి. శనివారం, ఆదివారాల్లో బ్యాంకులను మూసివేస్తున్నారు. మే నెల నుంచి దీనిని అమలు చేస్తున్నారు.
మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గడంతోపాటు ‘లక్ష్మీర్ భండార్’ అనే పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో కొత్త బ్యాంకు ఖాతాలు తెరువాల్సి ఉండటంతో బ్యాంకుల పని వేళలను గతంలో మాదిరిగా సాధారణ స్థాయికి మార్పు చేసినట్లు సీఎం మమత తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంట వరకు బ్యాంకులు తెరిచి ఉంటాయని, సాయంత్రం 4 గంటల వరకు బ్యాంకు కార్యకలాపాలు జరుగుతాయని చెప్పారు.
కాగా, ‘లక్ష్మీర్ భండార్’ పథకం ద్వారా 25-60 ఏండ్ల మహిళలకు ఆర్థిక సహాయం అందించనున్నారు. దీని కింద షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కుటుంబాల మహిళా ఇంటి పెద్దకు నెలకు రూ.1,000, సాధారణ వర్గానికి చెందిన వారికి రూ.500 ఆ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ నగదును వారి బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తుంది. ఈ పథకం కింద సుమారు 1.6 కోట్ల మంది ప్రజలు లబ్ధిపొందనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

