న్యూఢిల్లీ: మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే నిందితుల ఫోన్లో బాబా సిద్దిక్ కుమారుడు జీషాన్ సిద్దిక్(Zeeshan Siddique) ఫోటో ఉన్నట్లు గుర్తించారు. స్నాప్‌చాట్ ద్వారా ఆ ఫోటోను కుట్రదారులు నిందితులకు షేర్ చేశారని పోలీసులు వెల్లడించారు. ఫోటోను షేర్ చేసిన తర్వాత డిలీట్ చేయాలని ఆదేశాలు ఉన్నట్లు ముంబై పోలీసులు చెప్పారు. ఎన్సీపీ నేతను హత్య చేయాలని తనను కొందరు ఆశ్రయించినట్లు నిందితుడు రామ్ కనోజియా చెప్పినట్లు క్రైం బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు. తొలుత అతను వెయ్యి కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. బాబా సిద్ధిక్‌ను చంపాలని కాంట్రాక్టును రామ్ కనొజియాకు అప్పగించినట్లు శుభమ్ లోంకర్ తెలిపాడు. తనతో పాటు నితిన్ సాప్రేకు కాంట్రాక్టు ఇచ్చినట్లు రామ్ చెప్పాడు.