Ayodhya | అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు ముహూర్తం ఫిక్స్..!
Ayodhya | అయోధ్య రామమందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు ముహూర్తం ఖరారైంది. జనవరి 22న మధ్యాహ్నం 12.20 గంటలకు కార్యక్రమం జరుగనున్నది. ప్రధాని నరేంద్ర మోదీ మృగశిర నక్షత్రంలో అభిజీత్ ముహూర్తంలో 12.20 గంటలకు రామ్‌లల్లాకు రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు.
Ayodhya | అయోధ్య రామమందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు ముహూర్తం ఖరారైంది. జనవరి 22న మధ్యాహ్నం 12.20 గంటలకు కార్యక్రమం జరుగనున్నది. ప్రధాని నరేంద్ర మోదీ మృగశిర నక్షత్రంలో అభిజీత్ ముహూర్తంలో 12.20 గంటలకు రామ్‌లల్లాకు రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. అయితే, కార్యక్రమానికి అంతర్జాతీయ స్థాయి ప్రచారం కల్పించేందుకు సాకేత్ నిలయంలో సంఘ్ పరివార్ సమావేశం జరిగింది. వేడుకల ప్రచారాన్ని నాలుగు దశలుగా విభజించి ముందుకు తీసుకెళ్లాలని భేటీలో నిర్ణయించారు. ఇందులో మొదటి దశ కార్యక్రమం ఆదివారం నుంచి ప్రారంభం కాగా.. డిసెంబర్ 20 వరకు కొనసాగనున్నది. కార్యక్రమం కార్యాచరణ ప్రణాళికను తయారు చేయనున్నారు.
ఇందుకు స్టీరింగ్ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లా, బ్లాక్ స్థాయిలో పది మందితో కూడిన బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే అయోధ్య రామమందిరం ఉద్యమానికి చెందిన కరసేవకులను సైతం ఈ బృందాల్లో చేర్చుకోనున్నారు. ఇక జనవరి ఒకటో తేదీ నుంచి రెండో దశ ప్రచారం ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ఇంటింటికీ తిరుగుతూ పది కోట్ల కుటుంబాలకు అక్షతలు, రామ్‌లల్లా చిత్రపటం, కరపత్రం అందజేయనున్నారు. ప్రతిష్ఠాపన రోజున దీపోత్సవం జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేయనున్నారు. జనవరి 22న మూడో దశలో దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. నాలుగో దశలో దేశవ్యాప్తంగా ఉన్న భక్తులకు రామ్‌లల్లా దర్శనం కల్పించే యోచనలో ఉన్నారు. రిపబ్లిక్ డే నుంచి ఫిబ్రవరి 22 వరకు కొనసాగనున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

