2023 చివరిలోగా అయోధ్య ఆలయంలో భక్తుల పూజలకు అనుమతి

అయోధ్య: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఉన్న రామ మందిరంలో 2023 చివరి నాటికి పూజల కోసం భక్తులను అనుమతివ్వనున్నారు. మొత్తం 70 ఎకరాల్లో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ పూర్తి నిర్మాణం 2025 చివరిలోగా పూర్తి కానున్నట్లు ట్రస్ట్ ఆఫీస్ బేరర్లు వెల్లడించారు. 2023 చివరిలోగా ప్రధాన ఆలయంలో పూజల కోసం భక్తులను అనుమతించనున్నట్లు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ చెప్పారు.
శ్రీ రామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్లోని 15 మంది సభ్యుల రెండు రోజుల సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతేడాది ఆగస్ట్ 5న ప్రధాని నరేంద్ర మోదీ ఆలయం కోసం శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. అయితే గత జనవరిలో ఆలయం నిర్మించబోయే ప్రాంతంలో దిగువన నీళ్లు రావడంతో నిర్మాణాన్ని నిలిపేశారు. ప్రస్తుతం ఇంజినీర్లు ఆలయ పునాదిపై పని చేస్తున్నారు. సెప్టెంబర్ 15 కల్లా ఇది పూర్తి కానుంది. దీపావళి సమయంలో రెండో దశ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

