Watch: ట్రాఫిక్ జామ్ నుంచి బయటపడేందుకు.. ఆటో డ్రైవర్ ఏం చేశాడంటే?
Auto Driver Rides On Foot Over Bridge | ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న ఒక ఆటో డ్రైవర్ ఆగలేకపోయాడు. సాహసోపేతమైన స్టంట్ చేశాడు. జనం నడిచే ఫుట్ఓవర్ బ్రిడ్జి మీదకు ఆటోను నడిపాడు. (Auto Driver Rides On Foot Over Bridge) నడక వంతెన మెట్ల పైకి ఆటోను దూకించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
న్యూఢిల్లీ: ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న ఒక ఆటో డ్రైవర్ ఆగలేకపోయాడు. సాహసోపేతమైన స్టంట్ చేశాడు. జనం నడిచే ఫుట్ఓవర్ బ్రిడ్జి మీదకు ఆటోను నడిపాడు. (Auto Driver Rides On Foot Over Bridge) నడక వంతెన మెట్ల పైకి ఆటోను దూకించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. హమ్దర్ద్ నగర్‌లోని జంక్షన్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అయితే ఒక ఆటో డ్రైవర్ నిరీక్షించలేకపోయాడు. మెయిన్ రోడ్డుపై ఉన్న ఆటోను ఫుట్ ఓవర్ బ్రిడ్జి వద్దకు నడిపాడు. అనంతరం నడక వంతెన మెట్ల పైకి ఆటోను దూకించాడు. అయితే బ్రిడ్జి పైకి ఎక్కుతున్న ఆటోలోకి ఒక వ్యక్తి జంప్ చేశాడు. ఇది చూసి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.
కాగా, ఆ సమయంలో అక్కడున్న కొందరు తమ మొబైల్ ఫోన్లలో ఈ వీడియోను రికార్డ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో క్లిప్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఆటో డ్రైవర్ సాహసోపేత స్టంట్‌ను కొందరు ప్రశంసించారు. అయితే ఆటోను ప్రమాదకరంగా నడపడం, వంతెనపైకి నడిచి వెళ్లే వారికి అతడు ఇబ్బంది కలిగించడం పట్ల కొందరు మండిపడ్డారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆ ఆటో డ్రైవర్‌పై అధికారులు చర్యలు తీసుకోవాలని మరికొందరు డిమాండ్ చేశారు.
सड़क पर जाम तो फुट ओवरब्रिज पर ऑटो
दिल्ली के हमदर्द नगर का वायरल वीडियो #उड़नखटोला 🛺🚀#Delhi #Viralvideo pic.twitter.com/GQ8oX9ERVG— Ramraj Choudhary (@RamrajC93952644) September 3, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

