Watch: వాహనదారులకు చలాన్లు జారీ చేసిన ఆటో డ్రైవర్.. వీడియో వైరల్
Auto Driver Issuing Challans | వాహన చట్టం నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఒక ఆటో డ్రైవర్ చలాన్లు జారీ చేశాడు. (Auto Driver Issuing Challans) ఈ విధులు నిర్వహించాల్సిన ఆర్టీవో అధికారులు ఆటో డ్రైవర్‌తో ఈ పని చేయించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. స్పందించిన ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.
ముంబై: వాహన చట్టం నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఒక ఆటో డ్రైవర్ చలాన్లు జారీ చేశాడు. (Auto Driver Issuing Challans) ఈ విధులు నిర్వహించాల్సిన ఆర్టీవో అధికారులు ఆటో డ్రైవర్‌తో ఈ పని చేయించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. స్పందించిన ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. మహారాష్ట్రలోని థానేలో ఈ సంఘటన జరిగింది. ఆర్టీవో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక ఆటో డ్రైవర్‌కు చలాన్లు జారీ చేసే పరికరాన్ని ఇచ్చారు. దీంతో వాహన చట్టం నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు అతడు చలాన్లు జారీ చేశాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు దీనిని గమనించారు. తమ మొబైల్ ఫోన్లో వీడియో రికార్డ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆర్టీవో అధికారి ఆ మెషిన్‌ను అతడి నుంచి తీసుకున్నాడు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆర్టీవో అధికారుల తీరుపై నెటిజన్లు మండిపడ్డారు. మెషిన్‌ను ఆటో డ్రైవర్‌కు ఇచ్చి అతడితో చలాన్లు జారీ చేయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనంలో కూర్చొన్న అధికారులు బయట వ్యక్తితో వారి విధులు నిర్వహించడాన్ని తప్పుపట్టారు.
మరోవైపు వైరల్ అయిన ఈ వీడియో క్లిప్‌పై ఆర్టీవో ఉన్నతాధికారులు స్పందించారు. ఆటో డ్రైవర్ చలాన్లు జారీ చేయడంపై దర్యాప్తు జరుపుతామని తెలిపారు. ఈ మెషిన్‌ను అతడికి ఇచ్చిన సంబంధిత అధికారిపై చర్యలు చేపడతామని చెప్పారు.
#WATCH | Thane rickshaw driver can be seen utilizing device owned by the RTO flying squad to issue challans for moving violations.
By: @Yourskamalk #Mumbai @ThaneCityPolice #Thane #FPJ pic.twitter.com/S2YXDEODML
— Free Press Journal (@fpjindia) August 31, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Journalist Shankar | ప్రశ్నించినందుకు జర్నలిస్టు శంకర్ అరెస్ట్.. మెడికవర్ యాజమాన్యం ఫిర్యాదుపై కేసు
Asian Para Games | భారత్‌కు ఒక్క రోజే 26 మెడల్స్.. 2 స్వర్ణాలతో మెరిసిన ఆర్చర్ శీతల్
BRS | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ ఇన్చార్జుల నియామకం
Shamonda Virus | తొలిసారిగా మనిషికి సోకిన షమోండా వైరస్
Nominated Posts | కోటరీకే నామినేటెడ్ కిరీటం.. 50కి పైగా నామినేటెడ్ పోస్టుల భర్తీకి రేవంత్, మహేశ్‌గౌడ్ కసరత్తు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

